
సమావేశంలో మాట్లాడుతున్న మహేశ్‌కుమార్‌గౌడ్. చిత్రంలో వాకిటి శ్రీహరి, పొన్నం, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, సీతక్క
బీసీ రిజర్వేషన్లకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలే అడ్డు
బీజేపీ బండారం బయట పెట్టేందుకే 15న కామారెడ్డిలో సభ
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించిన తర్వాతే ఎన్నికలకు వెళతామని టీపీ సీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆలస్యమైనా సరే రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధిస్తామన్నారు. బీసీలకు అన్యా యం చేస్తున్న బీజేపీ బండారాన్ని బయటపెట్టి, రిజర్వేషన్లకు అడ్డుతగిలేవారి భరతం పట్టేందుకు ఈనెల 15న కామారెడ్డి లో రెండు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా చేసిన డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానం మేరకు తాము అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి, బీసీల జనాభా లెక్కలు తేల్చామన్నారు. దీని ప్రకారం బీసీలు 56.33 శాతం మంది ఉన్నట్లు తేలిందని, అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం సాధించిందని పేర్కొన్నారు. అయితే ఆ బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపితే అక్కడ చట్టం చేయడానికి సహకరించాల్సిన బండి సంజయ్, కిషన్‌రెడ్డి అడ్డు తగులుతున్నారన్నారు.
అమలు చేసి తీరుతాం..
‘కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావులు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ, బండి సంజయ్ మున్నూ రు కాపు.. అయినా దేశ్‌ముఖ్‌లా వ్యవహరిస్తున్నారు’అని మహేశ్‌గౌడ్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి.. రెడ్డి అయినా బీసీల కోసం కష్టపడుతున్నారన్నారు. ధర్మపురి అర్వింద్ బీసీ ల గురించి మాట్లాడడం లేదని, ఈటల రాజేందర్ ముఖం చాటేశారని విమ ర్శించారు. బండికి పౌరుషం ఉంటే మోదీ, అమిత్‌షాలను ఒప్పించి రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత ఇప్పించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్, కిషన్‌రెడ్డిలు ఎన్నికల్లో దేవుడి పేరుతో ఓట్లడుక్కునే బిచ్చగాళ్ల ని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, మదన్ మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతరావు, భూపతిరెడ్డి, ఆది శ్రీని వాస్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.