సాక్షి, హైదరాబాద్: ధైర్యం ఉంటే సిట్ విచారణ వీడియో బయటపెట్టాలని సవాల్ చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ ప్రభుత్వం లీక్‌లతో కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీక్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ బావమరిది కుంభకోణాన్ని ఆధారాలతో బయటపెడితే సిట్ నోటీసులు ఇచ్చారు. సృజన్ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ఈ డైవర్షన్ డ్రామా. నీ చిట్టాలు బయటపెడుతూనే ఉంటాం. ఇవాళ సింగరేణి స్కాం పార్ట్-2 బయటపెడుతున్నాను. సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బొగ్గు స్కాంతో తెలంగాణ ప్రతిష్టకు మచ్య పడింది. సింగరేణిలో సోలార్ పవర్ స్కాం జరిగింది. 127 మెగావాట్ల సోలార్ పవర్ స్కాం జరిగింది. దీనికి కూడా సైట్ విజట్ కండీషన్ పెట్టారు. 107 మెగావాట్లను రూ.540 కోట్లకు అప్పగించారు. రూ.214 కోట్లను అదనంగా కేటాయించారు.
మూడు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాల్సి ఉండగా.. మూడు కలిపి సింగిల్ టెండర్ పిలిచారు. ఎంఎస్‌ఎంఈలు పాల్గొనకుండా చేసి తమ అనుయాయులకు కట్టబెట్టారు. గోల్టి సోలార్ పవర్ ప్లాంట్‌కు టెండర్ ఇచ్చారు. ఈ స్కాం రామగుండంలో జరిగింది. బొగ్గు స్కాం కుంభకోణంతో కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బీజం పడింది. సీఎం బావమరిది స్కాం ఆధారాలు బయటపెడితే నోటీసులు ఇస్తారా?. కడుపు మంటతోనే కేటీఆర్, నాకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు మేము భయపడేవాళం కాదు.
దేశ వ్యాప్తంగా సోలార్ పవర్ టెండర్లు జరుగుతున్నాయి. దేశం అంతటా మూడు కోట్లకే ఒక మెగావాట్ ఇస్తుంటే.. తెలంగాణలో 5కోట్ల 4లక్షలకు ఒక మెగా వాట్ ఇస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ వాళ్లకు కాకుండా గుజరాత్ సంస్థకు కట్టబెట్టారు. ఒక్కో మెగావాట్‌కు 7కోట్లకు కట్టబెట్టారు. ఇది కేవలం ఇష్టాలేషన్‌లో జరిగిన స్కాం. రేపు కొత్తగూడెం సింగరేణిలో కిషన్ రెడ్డి సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తున్న అన్ని స్కాంలపై విచారణ చేయాలని కోరుతున్నాను.
మూడో స్కామ్ ఉంది ఎక్స్‌క్లూజివ్ స్కాం జరిగింది. ఈ స్కాంలో జీవన్ రెడ్డి మరో అధికారి రిజైన్ చేసి వెళ్లారు. ప్రకాశం ఖని స్కాం జరిగింది.. వెయ్యి కోట్ల టెండర్లో జరిగింది. సైట్ విజిట్ పేరుతో ప్రకాశం ఖని టెండర్ పిలిచారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ తప్పు అయితే దీని క్యాన్సిల్ చెయ్యాలి. శ్రీరాంపూర్ ఓబీ టెండర్లతో స్కాం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సైట్ విజిట్‌తో పిలిచిన టెండర్లు అన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మీ బావమరిదిపై సిట్ వేయాలి. సింగరేణితో పాటు అన్ని కలిసి సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి బెదిరింపులకు నేను భయపడను అంటూ హెచ్చరించారు.


