
గంగాపూర్‌లో పొలాల వద్ద రైతులతో హరీశ్ రావు ముచ్చట్లు
రేవంత్‌రెడ్డికి తిట్లపైనే ధ్యాస: హరీశ్‌రావు
చిన్నకోడూరు (సిద్దిపేట): సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడంపై ఉన్న సోయి రైతుల మీద లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన ఆదివారం సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని మాచాపూర్‌లో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. రాష్ట్రంలో 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరి గిందని, మక్కలు మార్కె ట్‌లో పెట్టుకుని రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. ఇప్పటికే 30 శాతం వరకు రైతులు దళారులకు విక్రయించారన్నారు. ప్రభుత్వం వెంటనే మొక్క జొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
సాగు ఎట్లుందమ్మా: వ్యవసాయం ఎట్లుందమ్మా.. ఇబ్బందులు వస్తున్నా యా అంటూ హరీశ్‌రావు రైతులను ఆప్యాయంగా పలకరించారు. ఏమున్న ది సారూ అన్నింటికీ ఇబ్బంది అవుతోందంటూ రైతులు బదులిచ్చారు. చిన్నకోడూరు మండల పరిధిలోని గంగాపూర్‌లో పొలాల వద్ద సద్ది తింటున్న రైతులతో హరీశ్‌రావు ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘యూరియా కోసం రోజుల తర బడి పడిగాపులు కాసినా ఒక్క బస్తా దొరక లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయలేదు. సన్న బియ్యంతో అన్నం ముద్ద అవుతోంది. మూడు పంటలు పండిస్తున్నామంటే మీరు తెచ్చిన కాళేశ్వరం నీళ్లే ఆసరా’ అని రైతులు చెప్పారు. రేవంత్ పాలన రైతులను నట్టేట ముంచిందని, రైతుల ఉసురు తప్పక తగులుతుందని హరీశ్ పేర్కొన్నారు.