హరీశ్‌రావుపై కోపంతో కాదు..
టీపీసీసీ నేత జగ్గారెడ్డి స్పష్టీకరణ
మళ్లీ ఇలాంటివి మాట్లాడొద్దంటూ కవితకు హితవు
తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానంటూ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: తాను హరీశ్‌రావుపై కోపంతో బీఆర్‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లానని కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కవిత చెప్పిన మాటల్లో వాస్తవం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జ గ్గారెడ్డి పేర్కొన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు తాను కాంగ్రెస్‌లోకి వచ్చా నని స్పష్టం చేశారు. ‘నేను బీఆర్‌ఎస్‌ను వీడడానికి, హరీశ్‌రా వుకు సంబంధం లేదు. అసలు ఆయన కారణమే కాదు.
నన్ను కాంగ్రెస్‌లోకి రమ్మని నా మిత్రుడు జెట్టి కుసుమకుమా ర్‌తో వైఎస్సార్ ఆహ్వానం పంపారు. నా రాజకీయం నచ్చి పిలిపించారు. కాంగ్రెస్‌లో చేరమన్నారు. సంగారెడ్డి నియోజ కవర్గానికి ఐఐటీతో పాటు ఫోర్‌లేన్ హైవే ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అసలు కవితకు అప్పు డు రాజకీయాల్లో అ, ఆ లు కూడా రావు. మరోమా రు ఇలాంటివి మాట్లాడొద్దు..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హరీశ్‌తో వార్ నడుస్తూనే ఉంటుంది..
కేసీఆర్ కుమార్తె కాబట్టి కవిత లీడర్ అయిందని, తాను వ్యక్తిగతంగా ఎదిగిన నాయకుడినని జగ్గారెడ్డి అన్నారు. వాళ్ల పంచాయతీలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో హరీశ్‌రావుకు, తనకు మధ్య వార్ నడుస్తూనే ఉంటుందని చెప్పారు. తాను డైరెక్ట్‌గా రాజకీయం చేస్తే, హరీశ్‌రావు వెనుక నుంచి పొడిచే రాజకీ యం చేస్తాడని ఆరోపించారు.
తాను రాజకీయంగా కొంత డిస్టర్బ్ అయ్యానని ఆయన పేర్కొన్నారు. అయితే ఎందుకు మానసికంగా చలించాననే విషయం సమయం వచ్చిన ప్పుడు చెపుతానని, మేలో అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపారు. తాను ఒక్కసారి డిసైడయ్యాక మళ్లీ వెనుకకు వచ్చే మనిషిని కాదని, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.


