
హైదరాబాద్: క్యాబినెట్‌లో రాద్దాంతం జరిగిందంటూ బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటరిచ్చారు. క్యాబినెట్‌లో రాద్దాంతం జరిగిందని హరీష్ నిరూపించగలరా? అంటూ సవాల్ విసిరారు. ‘ నిన్న క్యాబినెట్లో ఎలాంటి రాద్దాంతం జరగలేదు.
క్యాబినెట్ ఎజెండా, ప్రజల సమస్యలు తప్పా ఇంకేమీ చర్చ జరగలేదు. జరగని విషయాలను జరిగిందని మాట్లాడి హరీష్ రావు దిగజారిపోయారు. హరీష్ రావు నీచమైన స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు. నిన్న వ్యక్తిగతంగా సీఎంతో మాట్లాడినపుడు కూడా ఇతర మంత్రుల మీద చర్చ చేయలేదు. రాష్ట్రంలో గన్ కల్చర్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం హరీష్ రావు. దండుపాళ్యం, దండుకున్న పాళ్యం బీఆర్ఎస్ పార్టీనే’ అని విమర్శించారు మంత్రి సీతక్క.
ఇదీ కూడా చదవండి:
‘రాష్ట్ర క్యాబినెట్ దండుపాళ్యం ముఠా మాదిరి తయారైంది’