సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. మరికాసేపట్లో జూబ్లీహిల్స్ పీఎస్‌లో సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం ఆయన్ని విచారించనుంది. అయితే ఈ పరిణామంపై బీఆర్‌ఎస్ భగ్గుమంటోంది. ఇది కాంగ్రెస్ సర్కార్ కుట్ర అని ఆరోపిస్తోంది.
తెలంగాణ భవన్‌కు చేరుకున్న హరీష్ రావు, బీఆర్‌ఎస్ కీలక నేతలు
నేతలతో భేటీ కానున్న హరీష్‌రావు
అక్కడి నుంచే సిట్ కార్యాలయానికి హరీష్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రిని ప్రశ్నించనున్న సిట్
తెలంగాణ భవన్‌కు భారీ చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
ఇటు తెలంగాణ భవన్.. అటు జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
👉నానక్‌రామ్‌గూడ నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు. తెలంగాణ భవన్‌లో కీలక నేతలతో సమావేశం. అక్కడి నుంచే సిట్ కార్యాలయానికి వెళ్లే అవకాశం. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు..
చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టే.. హరీష్‌రావు
నిన్న రేవంత్ బావమర్ది బాగోతాన్ని ఉదయం బయటపెట్టా
సాయంత్రానికి సిట్ నోటీసులు పంపారు
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ నోటీసులు
రాత్రి నేను హైదరాబాద్‌లో లేనిది చూసి నోటీసులు అందించారు
రాత్రే హుటాహుటిన సిద్ధిపేట నుంచి వచ్చా
ఎలాంటి తప్పు చేయలేదు.. చట్టాన్ని గౌరవిస్తాం.. అందుకే విచారణకు హాజరవుతున్నా
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
ఎన్నికల హామీలను అమలు చేయకుండా.. అక్రమాలు చేస్తున్నారు
ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు
మాకు నోటీసులు కొత్త కాదు.. పోరాటాలు కొత్త కాదు
ప్రతీ ఎన్నికల సమయంలో ఈ డ్రామాలు ఆడుతున్నారు
రేవంత్‌రెడ్డి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన హరీష్‌రావు
👉మరికాసేపట్లో తెలంగాణ భవన్‌కు హరీష్‌రావు, కేటీఆర్.. హరీష్‌రావు నివాసానికి భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు
👉హరీష్‌రావు నివాసానికి కేటీఆర్.. ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్న హరీష్
👉లాయర్లతో భేటీ అయిన హరీష్‌రావు.. సిట్ విచారణలో మాట్లాడాల్సిన అంశాలపై చర్చ
👉కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈ కేసులో సుప్రీం కోర్టు హరీష్‌రావుకు ఉపశమనం ఇచ్చిందని.. కానీ, హరీష్‌రావు బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందునే డైవర్షన్ డ్రామా చేస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్‌రావులు ఆ పార్టీ అధికార కార్యాలయం తెలంగాణ భవన్‌లో మరికాసేపట్లో భేటీ కానున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు ఇప్పటికే భారీగా చేరుకున్నాయి. అక్కడి నుంచే నేరుగా ఆయన సిట్ కార్యాలయానికి వెళ్తారని సమాచారం.
👉ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ వేళ.. బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ఏఆర్ పోలీసులను మోహరింపజేశారు. హరీష్‌రావును మాత్రమే లోపలికి అనుమతిస్తామని అధికారులు అంటున్నారు.
👉హరీష్ రావు తన ఫోన్ ట్యాంపింగ్ చేయించారంటూ ఓ వ్యాపారి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది మార్చి 10వ తేదీన ఈ ఫిర్యాదుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ కేసును హైకోర్టు కొట్టేయగా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే అక్కడ సర్కార్‌కు చుక్కెదురైంది. అయినప్పటికీ ఈ కేసు ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద సిట్ నోటీసులు జారీ చేసింది.

👉ఈ కేసు విచారణలో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా హరీష్ రావును ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటిదాకా సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను ముందుంచే అవకాశం లేకపోలేదు. తొలిసారి విచారణకు వస్తుండడంతో.. 2023 ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ టాపింగ్ వ్యవహారంపైనా ఆయన వాంగ్మూలం నమోదు చేయొచ్చని తెలుస్తోంది. మరోవైపు..
ఫోన్‌ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు విచారణతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ సభ్యుల బృందం హరీష్ రావు ప్రశ్నించనుంది.


