సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ హయాంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని ఆర్థిక సర్వే చెప్పిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 17 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం తెలంగాణకు మరణ శాసనం అంటూ హరీష్ వ్యాఖ్యానించారు. కత్తి చంద్రబాబుది.. పొడుస్తున్నది రేవంత్‌రెడ్డి. తక్షణమే ఢిల్లీలో అధికారుల మీటింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం బాయ్ కాట్ చేయాలి’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


