’జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం’ | Harish Rao key comments on Jubilee Hills by elections | Sakshi
Sakshi News home page

’జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం’

Oct 27 2025 7:21 PM | Updated on Oct 27 2025 7:50 PM

Harish Rao key comments on Jubilee Hills by elections

సాక్షి,హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి వస్తుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మాగంటి గోపీనాధ్‌ భార్యకు టికెట్‌ ఇవ్వడం తప్పా. మాగంటి సునీత ఏడుపును మంత్రులు రాజకీయం చేశారు. రోడ్‌రోలర్‌, చపాతీ మేకర్‌, సబ్బు పెట్టె గుర్తులతో జాగ్రత్త. రేవంత్‌రెడ్డి దింపుడు కళ్లెం ఆశతో ఇండిపెండెంట్‌ అభ్యర్థులను పోటీలో పెట్టారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం’అని మాజీ మంత్రి హరీష్‌ రావు ధీమావ్యక్తం చేశారు.  
 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌
బిహార్ ఎన్నికలతో పాటు  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. నవంబర్‌ 11న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక  పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 14న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 13 నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 వరుకు గడువు ఇచ్చింది. ఈ నెల  22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. జూబ్లీహిల్స్‌ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించింది. మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతను బరిలోకి దించిన బీఆర్‌ఎస్‌.. సిట్టింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 కాగా, జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి పురుషులకు 924 మహిళలుగా ఉంది.  ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18–19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది వికలాంగులు ఉన్నారు.

వీరిలో 519 మంది చూపు కోల్పోయిన వారు, 667 మంది కదలికల లోపం ఉన్న వారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు. విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చబడ్డారు, 663 మంది తొలగించబడ్డారు. దీంతో మొత్తం సంఖ్య 3,98,982కి చేరింది. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement