అనాథ పిల్లలతో సహపంక్తి భోజనం చేస్తున్న హరీశ్‌రావు
కొడంగల్‌లో ఓడినప్పుడు చేసిన రాజకీయ సన్యాసం ఏమైంది?
చిల్లర మాటలు మానుకో
సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
సిద్దిపేట జోన్: ‘వయసులో నీకు తండ్రి లాంటి వారైన కేసీఆర్‌పై మాట్లాడిన మాటలు ఏమిటి? టైమ్ వస్తది బిడ్డా! నీవేదో వీర్ర వీగుతు న్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. ఇప్పటి కైనా చిల్లర మాటలు మానుకో’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్‌రె డ్డి అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టక, కా స్మెటిక్ చార్జీలు ఇవ్వడం చేతకాక దుర్భాషలాడటం తగునా అని ప్రశ్నించారు. అలాంటి రేవంత్‌రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువేనంటూ మండిపడ్డారు.
గురువారం క్రిస్మస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జి స్కూల్‌ను హరీశ్‌రావు సందర్శించారు. వారి యో గక్షేమాలు అరా తీసి పిల్లలతో సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మాట లు సీఎంకే కాదు.. మాకూ వస్తాయి. తెలంగాణకు జరుగుతున్న నీటి అన్యాయం, కాంగ్రెస్ ఎన్నికల హామీల గురించి కేసీఆర్ మాట్లాడితే సీఎం స్థాయి మరచి రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడటం ఏమిటి? మళ్లీ గెలుస్తా, టూ థర్డ్స్ మెజారిటీతో గెలుస్తా అని శపథాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి.. కొడంగల్ ఎన్నికల్లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన శపథం ఏమైంది? రేవంత్‌రెడ్డికి మాటతప్పడం, పార్టీలు మారడం, పదవులు కొనుక్కోవడం, చిల్లర మాటలు మాట్లాడటం బాగా అలవాటే’ అంటూ హరీశ్‌రావు మండిపడ్డారు.
ఫార్మాసిటీ భూముల్ని రైతులకు తిరిగివ్వాలి..
ఫార్మాసిటీని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కేసీఆర్ అడగడం తప్పా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. గతంలో ఫార్మాసిటీ భూములు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్.. ప్రస్తుతం చేస్తున్న పని ఏమిటని నిలదీశారు. కేసీఆర్ ఆలోచన మేరకు ఫార్మాసిటీని ఏర్పాటు చేయకుంటే రైతులకు భూములు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు, మెస్ చార్జీలు అందక అనాథ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, సీఎం ఇప్పటికైనా బిల్లులు విడుదల చేయాలన్నారు.


