
సాక్షి, ఖమ్మం జిల్లా: జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ సంగతి తెలుస్తుందంటూ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుందో కేటీఆర్ తెలుసుకోవాలన్న పొంగులేటి.. రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణా రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు
‘‘మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. మూడున్నర సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఇటీవల ఒక మహిళ ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందినప్పుడు జరిగిన ఎన్నికల్లో మీ బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో స్థానంలో ఉందొ లెక్క పెట్టుకో..
..త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బీఆర్‌ఎస్ పార్టీ స్థానం ఎక్కడ వుంటుందో ఆలోచించుకో. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకో.. నీ దయా దాక్షిణ్యాలతో బీ ఫామ్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కేసీఆర్.. పాలేరు వచ్చి ముక్కు నేలకు రాసినా ఏం చేయలేక పోయాడు నువ్వెంత’’ అంటూ కేటీఆర్‌పై పొంగులేటి మండిపడ్డారు.