సాక్షి, హైదరాబాద్: అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడిగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ‘‘ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు.
‘‘ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతోంది. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలి. బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోము. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నాయకుడు విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి.
ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం.
ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ,… https://t.co/gHtfUrCENN— KTR (@KTRBRS) January 21, 2026


