
తెలంగాణలో కవిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత రాజీనామా రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, సంతోష్ రావుపై ఆరోపణలు పలువురు నేతలపై వ్యాఖ్యలు చేయడంతో అధికార కాంగ్రెస్, పలువురు నేతలు స్పందిస్తున్నారు.
బండి సంజయ్ కామెంట్స్..
- కాళేశ్వరంలో పక్కా అవినీతి జరిగింది.
- కేసీఆర్ కుమార్తెనే చెప్పింది.
- భూమ్మీద జరిగిన అతి పెద్ద అవినీతి కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్.
- సీబీఐకి రెండేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి.
- కోర్టులో వాదించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫేయిల్ అయిపోయింది.
- కేంద్రానికి ఈరోజు సీబీఐ ఎంక్వైరీ కోరుతూ లేఖ రాసి చేతులు దులుపుకునే యత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.
- ఫోన్ ట్యాపింగ్‌లో జడ్జీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ ట్యాపింగ్ చేస్తే దాన్ని ఎందుకు మరి సీబీఐకి ఇవ్వలేదో చెప్పాలి.
- ఒక డెయిలీ సీరియల్‌లా నడిపిస్తున్నారు.
- విద్యుత్ కొనుగోళ్ల స్కాం విషయంలో రిపోర్ట్ ఏమైందో తెలియదు.
- కేసీఆర్ బిడ్డ అయితే ఏంది?
- బీఆర్ఎస్ అవినీతిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కవిత ఇష్యూను తెరపైకి తెస్తున్నారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్..
- తెలంగాణ రాష్ట్రాన్ని జలగల్లా ఐదుగురు కలసి దోచుకున్నారు.
- అందులో కవిత కూడా ఉంది.
- కవిత బయటకు వచ్చి అవినీతిపై మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నా.
- సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి కేసీఆర్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
- బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు, సంతోష రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ ఎట్లా అవుతుంది.
- హరీష్ రావు, ఈటెల రాజేందర్, సంతోష్ రావు అవినీతి చేస్తుంటే చూస్తూ కూర్చున్న కేసీఆర్ కూడా అవినీతి పరుడే.
- దోచుకున్న అవినీతి సొమ్ము పంపకాల్లో పంచాయతీతోనే కవిత బయటకు వచ్చింది
- కాళేశ్వరం విచారణ త్వరితగతిన పూర్తి చేసేలా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి.
కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కవిత రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు..
ఒక ప్రతిపక్ష పార్టీ నేతతో సీఎం ఒప్పందం చేసుకుంటారా?.
మీ నిస్సహాయతను మాపై చూపెట్టడం ఏంటి?
ఇంటి పంచాయితీని కాంగ్రెస్ రుద్దుతున్నారు.
హరీష్ రావుపై కేసులు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉంది..
కాళేశ్వరంలో హరీష్ రావు పేరు కూడా ఉంది..
బీఆర్ఎస్ పార్టీ మాకు ఎప్పుడు ప్రత్యర్థే.
కవితను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడమా?.
అది కలలో కూడా జరగదు.