సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు.. ఫర్నిచర్‌ను తగలబెట్టారు. మంటలను ఫైర్ సిబ్బంది, పోలీసులు అదుపు చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిన రేగా కాంతారావు.. కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్‌ఎస్ కార్యాలయంగా మార్చారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. ఇప్పుడు ఆ కార్యాలయాన్ని స్వాధీన పరుచుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.


