breaking news
besiege
-
మంత్రి లోకేష్ మోసం.. తిరగబడ్డ టీచర్లు
సాక్షి, విశాఖపట్నం: కూటమి సర్కార్‌పై ఉపాధ్యాయులు తిరగబడ్డారు. లోకేష్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయలు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో 13 ఉమ్మడి జిల్లాల డీఈవో కార్యాలయాల ముట్టడిని టీచర్లు చేపట్టారు. విశాఖ డీఈవో కార్యాలయం ముట్టడికి కదం తొక్కారు. పోలీసులు భారీగా మోహరించారు. ఎస్జీటీలకు మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ వద్దు.. మ్యాన్యూవల్ కౌన్సిలింగ్ ముద్దు అంటూ టీచర్లు నినాదాలు చేశారు. డీఈవో కార్యాలయం ముందు మహిళా టీచర్లు బైఠాయించారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగుతోంది.టీచర్ల బదిలీలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి. ఎస్జీటీల బదిలీలను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా చేపడతామని చెప్పి.. ఆన్లైన్ విధానం అమలు చేయడాన్ని తప్పుబడుతూ ఆ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం కౌన్సెలింగ్ జరిగిన ఎంఈఓ కార్యాలయాల ఎదుట నిరసనలకు దిగారు. ఆదివారం కూడా అన్ని జిల్లాల్లో డీఈవో కార్యాలయాలను ముట్టడించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చాయి.ఈ అంశంపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాసినా ఎలాంటి సమాధానం ఇవ్వనందున తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన చేపడుతున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి గతేడాది సెపె్టంబర్ నుంచి వారం వారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి బదిలీలు, పాఠశాలల పునర్ వ్యవస్థీకరణపై విజ్ఞప్తులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఈసారి ఉపాధ్యాయ బదిలీలకు చట్టం చేస్తున్నామని, ఏటా ఈ చట్ట ప్రకారమే ఆన్లైన్ బదిలీలు చేపడతామని అధికారులు తెలిపారు. అయితే, సంఖ్యాపరంగా అత్యధిక ప్రాథమిక పాఠశాలలు ఉండటంతో వాటిలో పనిచేస్తున్న ఎస్జీటీలకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉన్నందున ఇబ్బందులు తలెత్తుతాయని.. ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టి బదిలీ చేయాలని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అందుకు అధికారులు అంగీకరించినా మార్చిలో చేసిన ఉపాధ్యాయ బదిలీ చట్టం–2025లో మాత్రం ఉపాధ్యాయులందరికీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.అయినప్పటికీ బదిలీ ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని అధికారులు సంఘాలకు హామీ ఇచ్చారు. నాడు తాత్కాలికంగా సమస్య పరిష్కారమైందని భావించినా.. మే నెలల విడుదల చేసిన ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల్లో తిరిగి ఆన్లైన్ విధానం ఒక్కటే ఉంటుందని పేర్కొన్నారు. దీంతో గత నెల 16న ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డీఈవో కార్యాలయాల ముట్టడి తలపెట్టింది. మరుసటి రోజు ఎస్జీటీల మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించింది. తాజాగా ఆన్లైన్ కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుందని, అందరూ ఎంఈవో కార్యాలయాలకు వచ్చి ఆప్షన్స్ పెట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళనకు దిగాయి. -
సిరిసిల్లలో హైటెన్షన్.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా తల్లి ఫోటోలతో కాంగ్రెస్ నాయకులు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణా తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.లాఠీఛార్జ్‌లో బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. తోపులాటలో టౌన్ సిఐ కృష్ణ వేలికి గాయమైంది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల పరస్పరం వాగ్వాదంతో రచ్చ రచ్చగా మారింది. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని.. కానీ పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ విషయంపై వివాదం నెలకొంది. -
బడ్జెట్ వేళ.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. విద్యార్థి విభాగం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కొందరు అసెంబ్లీ ముట్టడికి సోమవారం యత్నించారు. దీంతో అసెంబ్లీ ఆవరణలో, నాంపల్లి చుట్టుపక్కల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వాలని, బడ్జెట్లో విద్యాశాఖకు 30 శాతం నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో వాళ్లు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పరిస్ధితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే.. పీడీఎస్‌యూ బయట ఆందోళన చేపట్టిన సమయంలోనే లోపల ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టి.. ప్రసంగించారు. ఈ బడ్జెట్లో విద్యా రంగానికి రూ. 19 వేల కోట్ల కేటాయించింది తెలంగాణ సర్కార్. -
కంటోన్మెంట్‌ను ముట్టడిస్తాం
కంటోన్మెంట్ (హైదరాబాద్): కంటోన్మెంట్లో బీ–3, బీ–4 స్థలాలను క్రమబద్ధీకరించాలని, ఆర్మీ చెల్లించాల్సిన సర్వీసు చార్జీల బకాయిల విడుదల కోసం త్వరలోనే కంటోన్మెంట్ బోర్డును ముట్టడిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సిఖ్‌విలేజ్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన ఆయన..అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. కంటోన్మెంట్ పరిధిలోని బీ–3, బీ–4 స్థలాల్లో నివసిస్తున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలన్నారు. ఈ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. సిఖ్‌విలేజ్ శ్రీరామ్‌నగర్, గాంధీనగర్‌లో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వారం రోజుల్లోగా మంచినీటి సదుపాయం కల్పించాలని సీఈఓ అజిత్‌రెడ్డికి సూచించారు. -
మంత్రి ఈటల ఇంటిని ముట్టడించిన ఏఎన్ఎంలు
కరీంనగర్: తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కోరుతూ 34 రోజులుగా సమ్మె చేస్తున్న రెండవ ఏఎన్ఎంలు శనివారం కరీంనగర్‌లోని ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇంటిని ముట్టడించారు. స్థానిక కోర్టు చౌరస్తా నుంచి మంత్రి ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ఆయన నివాసం వద్ద బైఠాయించారు. అప్పటికే మంత్రి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎన్‌ఎంలను అడ్డుకున్నారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ... తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నెల రోజులు దాటినా కనీసం చర్చలకు కూడా పిలువలేదని విమర్శించారు. పదేళ్లుగా పది వేల వేతనానికి పనిచేస్తున్నామని, పెరుగుతున్న ధరలతో జీవించడం చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించాలని, హమీ ప్రకారం ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.