సిరిసిల్లలో హైటెన్షన్‌.. కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడి | Congress Leaders Besiege KTR Camp Office In Sircilla | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో హైటెన్షన్‌.. కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం ముట్టడి

May 26 2025 4:25 PM | Updated on May 26 2025 6:00 PM

Congress Leaders Besiege KTR Camp Office In Sircilla

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్‌ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా తల్లి ఫోటోలతో కాంగ్రెస్ నాయకులు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్‌ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణా తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు.

లాఠీఛార్జ్‌లో  బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. తోపులాటలో టౌన్  సిఐ కృష్ణ వేలికి గాయమైంది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల పరస్పరం వాగ్వాదంతో రచ్చ రచ్చగా మారింది. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని.. కానీ పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉందని  సోషల్ మీడియాలో వైరల్‌ కాగా, ఈ విషయంపై వివాదం నెలకొంది.

సిరిసిల్లలో హైటెన్షన్ కేటీఆర్ ఆఫీసులో కాంగ్రెస్ గొడవ

 

Advertisement
 
Advertisement
Advertisement