
సాక్షి, హైదరాబాద్: తన తండ్రిపై ఎంతో ఒత్తిడి నెలకొని ఉండొచ్చని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉంటారని కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఒకవైపు కవిత ప్రెస్‌మీట్ పెట్టి సంచలన ఆరోపణలు, కీలక చేసిన వేళ.. ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాత్రం రిలాక్స్‌గా గడిపారు.
సెప్టెంబర్ 1వ తేదీన కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి హరీష్‌రావు, సంతోష్‌రావులే కారణమని ఆరోపించడం కలకలం రేపింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ సీనియర్లకు, పార్టీ కేడర్‌కు కోపం తెప్పించింది. దీంతో ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో ఎడతెరిపి లేకుండా బీఆర్‌ఎస్ కీలక నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు.
బుధవారం ఉదయం నుంచి కూడా భేటీ జరుగుతుండగా.. కవిత ప్రెస్‌మీట్ సమయంలో మధ్యలోనే ఆయన బయటకు వెళ్లారు. కారులోనే వ్యవసాయ క్షేత్రం చుట్టూ తిరిగి పొలాలను చూసొచ్చారు. తిరిగి ఫామ్‌హౌజ్‌కు వచ్చి నేతలతో భేటీ కొనసాగించారు.