
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో విచారణ కొనసాగుతోంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను చింతా ప్రభాకర్ అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో కాలే యాదయ్య ప్రత్యక్ష విచారణ ముగిసింది. అనంతరం, మరో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ మొదలైంది.
ఇదిలా ఉండగా..ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లు.. పిటిషన్‌దారులైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ ను సోమవారం (సెప్టెంబర్ 29) విచారించిన విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా బుధవారం (అక్టోబర్ 01) ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. ఇక, ఈరోజున కూడా అసెంబ్లీలో సోమవారం నాటి ఆంక్షలే అమలు అవుతున్నాయి.