
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్ విడుదలైంది. ఎల్లుండి(సోమవారం, సెప్టెంబర్ 29) నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభం కానుంది. అనర్హత పిటిషన్లపై ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేయనున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ను విచారించనునున్నారు. 12 గంటలకు కాలె యాదయ్య, ఒంటిగంటకు మహిపాల్‌రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ విచారణకు హాజరుకానున్నారు. అక్టోబర్ 1న మరోసారి విచారణ కొనసాగనుంది.
కాగా, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌లు నిన్న (శుక్రవారం) రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
స్పీకర్ ఇచ్చిన నోటీసులకు సమాధానమిచ్చేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువు ఇవ్వాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్‌ను కోరినట్టు సమాచారం. అయితే, ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసులపై ఈ నెల 29వ తేదీ నుంచి స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రత్యక్ష విచారణకు ఇవాళ షెడ్యూల్ విడుదలైంది.