
హైదరాబాద్, సాక్షి: బీఆర్‌ఎస్ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కల్వకుంట్ల కవిత మరో బాంబ్ పేల్చారు. కేటీఆర్ సంబంధికుల ఫోన్లు సైతం ట్యాప్ అయ్యాయని అన్నారామె. బుధవారం జాగృతి కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన అనంతరం చిట్‌చాట్‌లోనూ సంచలన ఆరోపణలకు దిగారు.
ఫామ్‌హజ్ విషయాలన్నీ కాంగ్రెస్‌కు తెలుస్తాయి. మా కుటుంబంలో నలుగురికి ఫోన్ ట్యాపింగ్ నోటీసులు వచ్చాయి. కేటీఆర్‌కు సంబంధించిన వాళ్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. హరీష్‌రావు, సంతోష్‌రావు, శ్రవణ్‌రావులే(ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు) ఫోన్ ట్యాపింగ్ చేయించారు. కేసీఆర్‌కు రాసిన నా లేఖ విడుదల చేసింది సంతోషే అని అన్నారామె.
ఈ గ్యాంగ్ గురించి కేసీఆర్‌కు గతంలో తాను స్వయంగా ఎంతో చెప్పానని.. బీఆర్‌ఎస్‌లో ఉండి ఇంతకాలం అంతర్గతంగా పోరాడానని, ఇప్పుడు బయటకు వచ్చి పోరాడతానని అన్నారామె. అలాగే..
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అవినీతిపైనా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనకు సమాచారం ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ‘‘జనగామ టికెట్ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. అందుకే నాకు పల్లా సమాచారం ఇచ్చారు. నా దగ్గర ఉన్న సమాచారం బయటపెడితే బీఆర్‌ఎస్ నేతలందరూ ఇబ్బంది పడతారు. నా దగ్గర బోలెడంత సమాచారం ఉంది. ఒక్కొక్కటిగా బయటపెడతా అని కవిత అన్నారు. భవిష్యత్తుపై ఎలాంటి ప్రణాళికలు లేవని.. అలాంటిది ఏమైనా జరిగినా కేసీఆర్ ఫోటోతోనే కార్యక్రమాలు చేపడతానని కవిత స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరూ మేకవన్నె పులులు!