సాక్షి, హైదరాబాద్: భద్రాచలంలోని మణుగూరులో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి, ధ్వంసంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గూండాల రాజ్యం, రౌడీయిజం పెరిగిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మణుగూరు ఘటనపై కేటీఆర్ మాట్లాడుతూ..‘కాంగ్రెస్ పాలనలో రౌడీయిజం పెరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలలా, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోటా రౌడీల రాజ్యం నడుస్తోంది. అరాచకత్వం కొనసాగుతోంది. దీనికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది’ అని హెచ్చరించారు. మరోవైపు.. పార్టీ ఆఫీసు దాడి ఘటనను వ్యతిరేకిస్తూ మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఆందోళన కార్యకర్తలు చేపట్టారు.
ఇక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని బీఆర్‌ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫర్నిచర్‌కు నిప్పు పెట్టడంతో పాటు ఆవరణలో ఫ్లెక్సీలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో భారత రాష్ట్ర సమితి కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఆఫీసుపై బీఆర్‌ఎస్ జెండాను తొలగించి కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. దీంతో, పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ గుండాగిరి ?
బీఆర్‌ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ అల్లరి మూకల దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్‌ఎస్ కార్యాలయంలో జెండా గద్దెను ధ్వంసం చేసి, కార్యాలయ భవనం మీద దాడి చేసిన కాంగ్రెస్ pic.twitter.com/vPW8AXh45D— Pavani Goud BRS (@PAVANIGOUD_BRS) November 2, 2025


