సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్‌ | KTR Tweet On Revanth Government | Sakshi
Sakshi News home page

సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా?: కేటీఆర్‌

Sep 12 2025 1:34 PM | Updated on Sep 12 2025 1:48 PM

KTR Tweet On Revanth Government

సాక్షి, హైదరాబాద్‌: సర్కార్ నడుపుతున్నారా?.. సర్కస్ నడుపుతున్నారా? అంటూ రేవంత్‌ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయిందని.. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

‘‘తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే.. తప్పు మాది కాదు జల మండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది!. మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అంటూ ఎక్స్‌ వేదికగా కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement