కేటీఆర్‌ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల | BRS KTR Extends Dussehra Wishes To Telangana People, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ దసరా శుభాకాంక్షలు.. వీడియో విడుదల

Oct 2 2025 11:22 AM | Updated on Oct 2 2025 12:50 PM

BRS KTR Extends dussehra Wishes To Telangana People

సాక్షి, హైదరాబాద్‌: దసరా సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. దసరా అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక పండగ. తమ సొంత ఊళ్ళల్లో, సొంత ప్రదేశాలలో ఇంటిల్లిపాదులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప వేడుక దసరా. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు కలుసుకొని తమ కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయ సంబురం దసరా.

ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు’ అని వీడియో పోస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement