
నగరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా బుధవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ఆద్యంతం సంబరంగా సాగాయి.

బీఆర్‌ఎస్ మహిళా నేతలు బతుకమ్మ, దాండియా ఆటలతో అలరించారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన హైదరాబాద్ నగర బీఆర్‌ఎస్ నాయకత్వానికి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.




















