మున్సిపల్‌ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్‌ నమోదు | Telangana Municipal Elections 2026 Live Updates And Headlines Polling Begins For 116 Municipalities And 7 Corporations | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

మున్సిపల్‌ ఎన్నికల్లో 73.01 శాతం పోలింగ్‌ నమోదు

మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్‌ నమోదు

కార్పొరేషన్లలో 66.05 శాతం నమోదు
మొత్తం పోలైన ఓట్లు: 38 లక్షల 9వేల 406 ఓట్లు
పురుషుల పోలింగ్- 72.63 శాతం
మహిళల పోలింగ్- 73.39 శాతం
అత్యధిక పోలింగ్ – నల్గొండ మున్సిపాలిటీ 77.36 శాతం
భద్రాద్రి (కొత్తగూడెం) 74.52 శాతం
రామగుండం కార్పొరేషన్ 69.32 శాతం
మహబూబ్‌నగర్ కార్పొరేషన్ 67.73 శాతం
మంచిర్యాల కార్పొరేషన్ 64.90 శాతం
కరీంనగర్ కార్పొరేషన్ 62.98 శాతం
అత్యల్ప పోలింగ్ – నిజామాబాద్ కార్పొరేషన్ 59.12 శాతం
కామారెడ్డి జిల్లా 65.94 శాతం
నిర్మల్ జిల్లా 65.47 శాతం
కొమరం భీమ్ ఆసిఫాబాద్ 64.32 శాతం
నల్గొండ (నందికొండ) 59.68 శాతం
 

2026-02-11 21:21:17

తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ముగిసిన పోలింగ్‌
5 గంటల లోపు క్యూలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అనుమతి
ఎల్లుండి(శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల  లెక్కింపు

 

 

 

2026-02-11 17:05:16

మధ్యాహ్నం 3 గంటల వరకు 62.09 శాతం పోలింగ్‌

తెలంగాణలో కొనసాగుతున్న  మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌
మధ్యాహ్నం 3 గంటల వరకు 62.09 శాతం పోలింగ్‌ నమోదు
సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న  పోలింగ్‌

 

2026-02-11 15:56:03

స్టేషన్ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

జనగామ జిల్లా: స్టేషన్ ఘన్‌పూర్‌ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల సిబ్బందిని పట్టించుకోని వైనం
కనీసం అన్నం లేదంటూ ఎన్నికల సిబ్బంది ఆవేదన
ఆర్డీవోతో ఆర్‌వోలు, పీవోల వాగ్వాదం
అవసరమైతే  పోలింగ్‌ను ఆపేస్తామంటున్న ఎన్నికల సిబ్బంది
నిన్న సాయంత్రం నుండి ఇప్పటివరకు కనీసం తిండి లేక...
తిప్పలు పడుతున్న ఎన్నికల సిబ్బంది

2026-02-11 15:22:16

కరీంనగర్ జిల్లా పోలింగ్ శాతం(3 PM)

కరీంనగర్           51.95
జమ్మికుంట        65.53
హుజురాబాద్      69.90
చొప్పదండి          74.28

2026-02-11 15:18:25

సంగారెడ్డి మున్సిపాలిటీ 34 వార్డులో తీవ్ర ఉద్రిక్తత

  •  సంగారెడ్డి మున్సిపాలిటీ 34 వార్డులో తీవ్ర ఉద్రిక్తత
  • సీఐ కాంగ్రెస్ అభ్యర్థి అడ్డు గల్లా పట్టారన్న సమాచారంతో 
    పోలింగ్ బూత్‌కు చేరుకున్న జగ్గారెడ్డి

  • పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్‌లోకి చొచ్చు కెళ్లిన జగ్గారెడ్డి

  • పోలీసులు,జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాద జరిగి తోపులాటకు దారి తీసింది

  • ఘటన స్థలానికి  కాంగ్రెస్ నాయకులు భారీగా చేరుకున్నారు.

2026-02-11 14:38:48

ఒంటి గంటకు వరకు 48.54 శాతం పోలింగ్

  • తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
  • మధ్యాహ్నం ఒంటి వరకు 48.54 పోలింగ్ శాతం నమోదు.
  • మున్సిపాలిటీలలో 51.66% నమోదు
  • మున్సిపల్ కార్పొరేషన్లలో 40.96% నమోదు
  • పలుచోట్ల ఉద్రిక్తతలు, వాగ్వాదాలు. 
2026-02-11 13:51:34

రూల్స్‌ ప్రకారమే ముందుకు వెళ్తాం: డీజీపీ

  • డీజీపీ శివధర్ రెడ్డి కామెంట్స్‌..
  • పోలింగ్‌కు సమస్యలు లేకుండా పోలీసులను ఏర్పాటు చేశాం.
  • నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే.
  • పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తే పోలీసు స్టేషన్‌కు తరలిస్తాం.
  • ఎన్నికల సమయంలో రూల్స్ ప్రకారంలో మేము వెళ్తాం.
  • అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం.
2026-02-11 13:29:53

మిర్యాలగూడలో ఉద్రిక్తత..

  • నల్లగొండ జిల్లా
  • మిర్యాలగూడ ఆరో వార్డులో ఉద్రిక్తత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం
  • బీఆర్ఎస్ శ్రేణులు దొంగ ఓట్లు వేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపణ
2026-02-11 13:09:32

పోలీసులతో గంగుల వాగ్వాదం..

  • కరీంనగర్ జిల్లా:
  • కరీంనగర్‌లో బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేస్తుండగా అడ్డుకున్న ఎమ్మెల్యే గంగుల..
  • పోలీసులు, గంగులకు మధ్య వాగ్వాదం.
  • బీఆర్ఎస్ నాయకుడు  కుర్ర తిరుపతిని అరెస్ట్ చేస్తుండగా అడ్డుకున్న మాజీ మంత్రి గంగుల
  • పోలీస్ వాహనంలో నుంచి బీఆర్ఎస్ కార్యకర్తను లాక్కుని బయటకు తీసుకొచ్చిన గంగుల
  • పోలీసుల తీరుపై ఎమ్మెల్యే గంగుల ఫైర్.
2026-02-11 13:09:32

ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: భట్టి విక్రమార్క

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో విజ్ఞులైన తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. 

బుధవారం మధిర పట్టణంలోని తొమ్మిదవ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిదెందుకు cure ప్యూర్, రేర్ కోర్ అర్బన్, ఫెరి అర్బన్, రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ విభాగాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నామని తెలిపారు. 

2026-02-11 13:05:31

ఓటేసిన జానారెడ్డి, కుమారులు

నల్లగొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి కే. జానారెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నాగార్జున సాగర్ శాసన సభ్యులు జయవీర్ రెడ్డి. 
 

2026-02-11 13:00:17

అంద‌రూ ఓటేయాలి: మంత్రి పొన్నం

హుస్నాబాద్ నవ భారత్  హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్న  మంత్రి పొన్నం ప్రభాకర్.

మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్‌
భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధం.
పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.
గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారు.. అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువ ఉంది..
116 మున్సిపాలిటీ లు ,7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న..
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణ తో  ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధి నీ ఎక్కుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న..
ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి చెప్తారు.
అర్బన్ లో అనేక పనులు ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకొని తమ ఓటు వినియోగించుకోవాలి.
అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోండి  ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం.

2026-02-11 12:56:21

28.48 ఓటింగ్‌ శాతం నమోదు

  • ఎన్నికల్లో ఉద్రికత్తలు.. 28.48 ఓటింగ్‌ శాతం నమోదు
  • తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌.
  • ఉదయం 11 గంటల వరకు 28.48 ఓటింగ్‌ శాతం నమోదు
2026-02-11 11:48:55

ఓటు వేసిన సీఎం రేవంత్‌..

  • ఓటు వేసిన సీఎం రేవంత్‌..
  • ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కొడంగల్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేసిన సీఎం
  • ఓటు వేసిన తర్వాత హైదరాబాద్‌ బయలుదేరిన రేవంత్‌రెడ్డి
2026-02-11 11:24:17

నిలిచిన పోలింగ్‌..

  • జగిత్యాల జిల్లా:
  • రాయికల్ మండల కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు తారుమారు
  • తొమ్మిదో వార్డు పోలింగ్ కేంద్రంలో, ఎనిమిదో వార్డుకు సంబంధించిన 12 బ్యాలెట్ పేపర్లు తారుమారు
  • నిలిచిన పోలింగ్
2026-02-11 11:10:05

ఓటు వేసిన బండి సంజయ్‌

  • ఓటు వేసిన బండి సంజయ్‌
  • కరీంనగర్ జిల్లా..
  • కరీంనగర్ జ్యోతినగర్ 50వ డివిజన్ లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్.
2026-02-11 11:10:05

కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం..

  • నిజామాబాద్..
  • నిజామాబాద్‌లోని 47వ డివిజన్ వీక్లీ మార్కెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
  • మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్
  • పుట్టిన గడ్డ నిజామాబాద్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నాను
  • రాష్ట్రంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది
  • ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన వరం దాన్ని అందరూ వినియోగించుకోవాలి
  • నాణ్యమైన నాయకులను ఎన్నుకునేందుకు దోహదపడాలి
  • బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
  • ప్రజలు విజ్ఞులు.. అన్ని తెలుసుకుంటారు
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం విజయాలు నమోదు చేస్తుంది
  • నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం
2026-02-11 11:10:05

కొడంగల్‌ చేరుకున్న సీఎం రేవంత్‌..

  • వికారాబాద్ జిల్లా
  • హెలికాప్టర్‌లో కొడంగల్  చేరుకున్న  సీఎం రేవంత్ రెడ్డి..
  • మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం
  • కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(బాలుర)లో ఓటు హక్కును వినియోగించుకోనున్న సీఎం.
  • అనంతరం నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి.
2026-02-11 11:10:05

ఓటు వేసిన మంత్రులు..

  • ఓటు వేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  • మధిర 9వ వార్డులో ఓటు వేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
  • నల్గొండ పబ్లిక్ స్కూల్‌లో ఓటు వేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
2026-02-11 10:31:53

12 శాతం ఓటింగ్‌ నమోదు..

  • ఉదయం 9 గంటల వరకు 12 శాతం ఓటింగ్‌ నమోదు..
  • తెలంగాణలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు
  • మందకోడిగా పోలింగ్‌.. మొదటి రెండు గంటల్లో 12 శాతం ఓటింగ్‌ నమోదు
2026-02-11 10:29:07

పోలింగ్‌ కేంద్రం వద్ద డబ్బు పంపిణీ

  • భూపాలపల్లి 22వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంపిణీ
  • ఓటర్లకు పోలింగ్ చిట్టీలతో పాటు రూ. 5 వేల చొప్పున పంపిణీ 
  • స్థానికుల సమాచారంతో పోలింగ్ కేంద్రం వద్దకు పోలీసులు  
  • డబ్బులు వదిలేసి పరారైన BRS అభ్యర్థి అనుచరులు  
  • రూ. లక్షకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు 
2026-02-11 10:24:00

జగిత్యాల బీఆర్ఎస్,ఎంఐఎం మధ్య వాగ్వాదం

  • జగిత్యాల బీఆర్ఎస్,ఎంఐఎం మధ్య వాగ్వాదం 
  • 31 వార్డులో పోటాపోటిగా నినాదాలు చేసుకున్న ఇరుపార్టీల కార్యకర్తలు
2026-02-11 10:22:37

నర్సాపూర్ మున్సిపాలిటీలో ఉద్రిక్తత

  •   మెదక్ నర్సాపూర్ లో మున్సిపాలిటీ  15 వవార్డులో ఉద్రిక్తత 
  •  చొక్కాలు పట్టుకొని కొట్టుకున్న బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు. చెదరగొట్టిన పోలీసులు  
2026-02-11 10:14:38

ఓటు వేసిన ఎమ్మెల్యేలు..

  • ఓటు వేసిన ఎమ్మెల్యేలు..
  • కామారెడ్డి జిల్లా..
  • కామారెడ్డి పట్టణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి
  • నల్గొండ జిల్లా..
  • మిర్యాలగూడలోని 15వ వార్డు హౌసింగ్ బోర్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
2026-02-11 08:22:52

కొనసాగుతున్న పోలింగ్‌..

  • తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 
  • ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. 
  • ఓటు వేసేందుకు క్యూలైన్లలో నిల్చున్నారు. 
2026-02-11 07:59:00

నిలిచిన పోలింగ్‌.. అభ్యర్థుల ఆందోళన

  • మహబూబ్‌నగర్‌..
  • 45వ డివిజన్‌ ఐదో బూత్‌లో ఉద్రిక్తత.
  • గుర్తులు తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్‌.
  • పోలింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థుల ఆందోళన. 
2026-02-11 07:38:03

జనగామలో భారీ బందోబస్తు..

  • జనగామ జిల్లా..
  • జనగామ మున్సిపల్ ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం
  • పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
  • 30 వార్డుల్లో 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • 180 మంది అధికారులు, సిబ్బంది విధుల్లో
  • ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు
  • డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆదేశాలతో గట్టి పోలీసు బందోబస్తు
2026-02-11 07:18:59

కొడంగల్‌లో సీఎం రేవంత్‌ ఓటు..

  • నేడు కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి..
  • కొడంగల్ మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం..
  • నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి.
  • మధ్యాహ్నం ఒంటి గంటలకు ఢిల్లీ వెళ్లనున్న సీఎం
  • ఏఐసీసీ ముఖ్య నేతలతో సాయంత్రం భేటీ 
     
2026-02-11 07:15:42

ఖమ్మంలో ఒక వార్డు ఏకగ్రీవం

  • ఖమ్మం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికలు...
  • 217 వార్డులలో ఒకటి ఏకగ్రీవం
  • 216 వార్డులలో జరగనున్న ఎలన్నికలు...
  • 900 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.
  • 197 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రత ఏర్పాటు..
2026-02-11 07:13:24

412 డివిజన్లలో పోలింగ్

  • నేడు ఏడు కార్పొరేషన్లలోని 412 డివిజన్లలో పోలింగ్
  • మహబూబ్‌నగర్, రామగుండం కార్పొరేషన్లలో 2 వార్డులు ఏకగ్రీవం
  • ఏడు కార్పొరేషన్ల పరిధిలో 2,174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
  • ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల బరిలో 2,225 మంది అభ్యర్థులు
  • కార్పొరేషన్లలో 410 కాంగ్రెస్, 401 బీఆర్‌ఎస్, 382 బీజేపీ అభ్యర్థులు
2026-02-11 07:11:33

13న ఓట్ల లెక్కింపు..

  • 13న ఓట్ల లెక్కింపు..
  • ఈ నెల 13వ తేదీ ఉదయం 8 నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
  • ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు 16,031 బ్యాలెట్ బాక్సులు
  • 137 స్ట్రాంగ్‌రూమ్‌లు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.
  • ఎన్నికల నిర్వహణ కోసం 742 మంది జోనల్ అధికారులు 279 ఫ్లయింగ్ స్క్వాడ్,
  • 381 స్క్వాడ్‌బృందాలు, 1370 రిటర్నింగ్ అధికారులు,
  • 1547 ఏఆర్​ఓలు 9,560 పోలింగ్ అధికారులు,
  • 31,428 మంది సిబ్బందిని నియమించి శిక్షణ 
2026-02-11 07:08:15

25 వేల మంది పోలీసులు..

  • 25 వేల మంది పోలీసులు..
  • ఎన్నికల కోసం సుమారు 25 వేల మంది పోలీసులతో బందోబస్తు
  • పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బంది విధులు.
  • అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు
  • ఎక్కడైనా రీ పోలింగ్ అవసరమైతే రేపు నిర్వహణ. 
2026-02-11 07:05:35

అభ్యర్థి భర్తకు గుండెపోటు..

  • అభ్యర్థి భర్తకు గుండెపోటు..
  • రాజన్న సిరిసిల్ల జిల్లా
  • సిరిసిల్ల మున్సిపాలిటీ 39వ వార్డు అభ్యర్థి చిటికెన విజయ భర్త సత్తయ్యకు గుండెపోటు...
  • తీవ్ర అస్వస్థతతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
  • ఆసుపత్రిలో కుటుంబాన్ని పరామర్శించిన నియోజకవర్గ ఇంచార్జ్‌ కేకే మహేందర్ రెడ్డి...
  • పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు.
2026-02-11 07:02:54

మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభం

  • తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ప్రారంభం. 
  • సాయంత్ర ఐదు గంటల వరకు కొనసాగనున్న పోలింగ్‌. 
మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్ డేట్స్ ఉద్రిక్తతల నడుమ పోలింగ్..
2026-02-11 07:00:44

పోలింగ్‌ ప్రాంతాల్లో నేడు సెలవు

  •  116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికలు

  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌  

  • 52.17 లక్షల మంది ఓటర్లు.. 2,981 వార్డులు, 12,944 అభ్యర్థులు

  • 8,191 పోలింగ్‌ కేంద్రాలు.. 100% కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

  • ఫిర్యాదుల స్వీకరణకు 9240021456 టోల్‌ ఫ్రీ నంబర్‌

  • పోలింగ్‌ ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు నేడు సెలవు

2026-02-11 06:57:54
Advertisement
 
Advertisement
Advertisement