బీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా | MLC Kalvakuntla Kavitha Key Press Meet On BRS Party Suspension, More Details Inside | Sakshi
Sakshi News home page

MLC Kavitha Press Meet: కవిత కీలక ప్రెస్‌మీట్‌ హైలైట్స్‌..

Sep 3 2025 8:27 AM | Updated on Sep 3 2025 1:34 PM

MLC Kavitha Key Press Meet On Party Decision

ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం హైలైట్స్‌.. 

👉పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి కవిత రాజీనామా చేశారు. ఇదే సమయంలో తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. 

👉అక్రమ కేసుల్లో నేను జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాను తప్ప.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. నా సస్పెన్షన్‌ వార్తలను మీడియాలో చూశాను. సస్పెండ్‌ చేస్తున్నట్టు నిన్న బీఆర్‌ఎస్‌ నుంచి ఓ ప్రకటన వచ్చింది. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. గులాబీ పార్టీ కండువా కప్పుకుని పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీ వ్యతిరేకమా?. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్లి మాత్రమే నేను మాట్లాడాను. లేఖలో ఉన్న రెండు అంశాలపై నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. 

కోట్లలో ఒక్కరు కేసీఆర్‌.. 
👉కేసీఆర్‌ నుంచే సామాజిక తెలంగాణ ఎజెండా నేర్చుకున్నాను. పని గట్టుకుని నాపై తప్పుడు ప్రచారం చేశారు. నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. కేసీఆర్‌ లాంటి తండ్రి కోట్లలో ఒక్కరు ఉంటారు. అలాంటి వ్యక్తి నాకు తండ్రిగా ఉన్నారు. అది నా అదృష్టం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా నా తల్లితో కూడా నేను మాట్లాడటం లేదు. ఆమెను కలవలేకపోతున్నారు. ఇలాంటి కష్టం ఏ బిడ్డకు రాకూడదు. ఇద్దరు వ్యక్తులు నా కుటుంబాన్ని విచ్చినం చేశారు. నాశనం చేయాలని చూశారు. విధి అనేది ఒక్కటి ఉంది. కచ్చితంగా వారికి కాలమే సమాధానం చెబుతుంది. తప్పకుండా అనుభవిస్తారు. 

రేవంత్‌తో కలిసి హరీష్‌ కుట్రలు.. 
👉నేను మొన్న చెప్పిన ఇద్దరు నేతలు నాపై చిలువలు పలువలుగా ప్రచారం చేశారు. హరీష్‌ రావు, సంతోష్‌రావు ఇంట్లో ఉన్న బంగారంతో సామాజిక తెలంగాణ అయితదా?. నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నాను. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతాను. రేపు కేటీఆర్‌, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్‌ రెడ్డితో కలిసి హరీష్‌ ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్‌కు హరీష్‌ సరెండర్‌ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలయ్యాయి. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్ర ఇది. 

రేపటి రోజు రామన్నకు ప్రమాదమే.. 
👉రేపు ఇదే ప్రమాదం రామన్నకు కూడా పొంచి ఉంది. హరీష్‌ రావు బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారు. హరీష్‌, రేవంత్‌ ఒకే విమానంలో పర్యటించినప్పటి నుంచే నాపై కుట్రలు ప్రారంభమయ్యాయి. డబ్బు సంపాదించాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రేవంత్‌, హరీష్‌ కుమ్మకై నాపై కుట్రలు చేశారు. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు సైట్‌ మార్చినప్పుడు మంత్రి హరీష్‌రావే కదా?. ఎస్సీ, ఎస్టీ, బీసీ హస్టళ్లకు హరీష్‌ డెయిరీ నుంచి పాల పంపిణీ జరిగింది. నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్పందించరా?. 103 రోజులైనా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అడగరా?. నన్ను సస్పెండ్‌ చేసినా.. పార్టీలో నేను కోరుకున్న ప్రజాస్వామ్యం వచ్చింది. 

హరీష్‌ వల్లే ఓటములు.. 
👉హరీష్‌ ట్రబుట్‌ షూటర్‌ కాదు.. డబుల్‌ షూటర్‌. ట్రబుట్‌ క్రియెట్‌ చేసి దీన్ని సాల్వ్‌ చేసినట్టు చెప్పుకుంటారు. మీడియా మేనేజ్‌మెంట్‌లో హరీష్‌ సూపర్‌. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు హరీష్‌ అడిషనల్‌ ఫండింగ్‌ ఇచ్చారు. ఆయన ఫండింగ్‌ చేసిన వ్యవహారం నాకు స్పష్టంగా తెలుసు. రామన్నను ఓడించడానికి సిరిసిల్లకు 60 లక్షలు పంపారు. తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి డే-1 నుంచి హరీష్‌ రావు లేరు. ఎమ్మెల్యే పదవికి, డిప్యూటీ స్పీకర్‌ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేస్తుంటే హరీష్‌రావు వద్దన్నారు. తొమ్మిది, పది నెలల తర్వాత వచ్చారు. హరీష్‌ రావు నక్క జిత్తులను గమనించండి. నిజామాబాద్‌లో నా ఓటమిలో కూడా కుట్రలు చేశారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను కూడా ఓడించే ప్రయత్నం చేశారు. ఇందులో సంతోష్‌ రావు హస్తం కూడా ఉంది. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలుపునకు కూడా హరీషే కారణం. హరీష్‌ వల్లే రఘునందన్‌ రావు, ఇతర కీలక నేతలు బయటకు వచ్చారు. దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఇలాంటివి చాలానే జరిగాయి. జగ్గారెడ్డి, విజయశాంతి, విజయరామారావు కూడా పార్టీ వీడింది హరీష్‌ రావు వల్లే. ఆరడుగుల బుల్లెట్‌ ఇప్పుడు నాకు గాయం చేసింది. తర్వాత మీకు గాయం చేస్తుంది. 

గ్రీన్‌ ఇండియా పేరుతో సంతోష్‌ రావు ఓవరాక్షన్‌.. 
👉హరితహారం కేసీఆర్‌ పెడితే.. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పేరుతో నకిలీ కార్యక్రమం చేపట్టాడు. సంతోష్‌ రావు కూరలో ఉప్పు లాంటి వాడు.  చిరంజీవి, ప్రభాస్‌ లాంటి సినీ నటులను మోసం చేసిన గ్రీన్‌ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేలా చేసి ఫార్టెస్ట్‌ను కొట్టేద్దామనుకున్నారు. సిరిసిల్లలో ఏడుగురు దళిత బిడ్డలను పోలీసులు ఇసుక వ్యవహారంలో కొట్టడానికి సంతోష్‌ రావు బాధ్యుడు. ఆయన కారణంగా కేటీఆర్‌, పార్టీకి నష్టం కలిగింది. సంతోష్‌ రావుతోనూ రేవంత్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉంది. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి నేనేమీ చేయలేదా?. పార్టీలో నా కాంట్రిబ్యూషన్‌ లేదా?. హరీష్‌, సంతోష్‌లదే ఉందా?. వాళ్లు మేకవన్నె పులులు నాన్న. కలికాలం కాబట్టి వాళ్ల టైమ్‌ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ హార్డ్‌ వేర్‌ అయితే.. జాగృతి సాఫ్ట్‌వేర్‌ అని చెప్పుకొచ్చారు. 

ఏ పార్టీలో చేరను.. 
👉చివరగా.. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీలో గానీ చేరడం లేదన్నారు. తన భవిష్యత్‌ గురించి జాగృతి నేతలు, బీసీ నాయకులు, అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement