సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌పై ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన మంత్రి.. పాలమూరులో బీఆర్‌ఎస్ తట్టేడు మట్టి ఎత్తి పోయలేదని మండిపడ్డారు. వచ్చే మూడేళల్లో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న ఉత్తమ్.. పాలమూరు ప్రాజెక్ట్ తరవాత కాళేశ్వరం మొదలైనా ఇప్పటికీ పాలమూరు పూర్తి కాలేదన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం 90 వేల కోట్లు ఖర్చు చేశారు.. పాలమూరు కు కేవలం 27వేల కోట్లు మాత్రమే. కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చాయి. పాలమూరకు ఇప్పటికీ అనుమతులు పూర్తిగా రాలేదు. పాలమూరు ప్రాజెక్టును కావాలనే బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం చేసింది బీఆర్‌ఎస్ సభ్యులు సభకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్.. కృష్ణా, గోదావరి జలాలపై ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని మేం ఖండిస్తున్నాం’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘కృష్ణా నీటిలో చుక్క నీరు వదులుకోం. తెలంగాణ హక్కులను కాపాడటంతో రాజీపడం. తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలకు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సంతకాలు చేశారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. తెలంగాణకు 34 శాతం నీళ్లు చాలు అని కేసీఆర్, హరీష్‌రావు సంతకాలు చేశారు. కేసీఆర్ తను ముఖ్యమంత్రిగా అబద్ధాలు చెప్పారు. కూర్చువేసుకొని దేవరకద్ర ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 24 వేల కోట్ల బడ్జెట్ల ఇరిగేషన్‌కు కేటాయిస్తే అందులో 16 వేల కోట్లు ఇంట్రెస్ట్‌కే వెళ్లాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ను 2నుంచి 3టీఎంసీ లకు పెంచారు... పాలమూరు ప్రాజెక్టును 1.5 నుంచి 1టీఎంసీకి పంపారు’’ అని ఉత్తమ్ చెప్పుకొచ్చారు.


