👉ప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారు: సీఎం రేవంత్
మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
రెండేళ్లలో గండిపేటకు గోదావరి జలాలు తీసుకొస్తాం
సంక్రాంతి లోగా ఫస్ట్‌ఫేజ్‌పై క్లారిటీ వస్తుంది
ఫస్ట్ ఫేజ్‌లో గండిపేట నుంచి గౌరెల్లి వరకు ప్రక్షాళన
ప్రతిపక్ష నేతలు మాపై విషం చిమ్ముతున్నారు
కడుపు నిండా విషం నింపుకున్నారు
రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని కొందరు మాట్లాడుతున్నారు
రియల్ ఎస్టేట్‌తో నగరం మరింత అభివృద్ధి జరుగుతోంది
మూసీ ప్రక్షాళన జరగాలా? వద్దా? ప్రతిపక్షనేతలు చెప్పాలి
మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు నివాసాలు కల్పిస్తామంటే అడ్డుకుంటున్నారు
ప్రతిపక్ష నేతలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉండగలరా?
👉మా సర్కార్ వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం: సీఎం రేవంత్
మూసీ ప్రక్షాళనపై సభ్యులు సూచనలు చేశారు
సభ్యుల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం
నదీ పరివాహక ప్రాంతాల్లోనే నిర్మాణాలు జరిగాయి
మోక్షగుండం విశ్వేశ్వరయ్య వరద ముంపు పరిష్కారం చూపారు
నిజాం ప్రభువు నిర్మించిన ప్రాజెక్ట్ ద్వారా నగరానికి నీరు అందుతోంది
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది
ఫామ్ హౌస్‌ల డ్రైనేజీలు గండిపేటలో కలిపారు
మా ప్రభుత్వం వచ్చాక వాటిపై ఉక్కుపాదం మోపాం
👉మండలిలో కవిత చిట్‌చాట్
రాజీనామా చేసి నాలుగు నెలల కాలం గడిచిపోయింది
నాలుగు నెలలో అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి
నా రాజీనామా ను ఆమోదించాలని చైర్మన్‌ను కోరడానికి మండలికి వచ్చా
ఫ్లోర్‌లో మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని చైర్మన్‌ను కలిసి కోరతా..
కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలి..
రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకు రేవంత్ రెడ్డినే రెండు సార్లు ఉరి తీయాలి
కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.
కేసీఆర్‌ను తిడుతుంటే కూతురిగా నాకు రక్తం ఉడుకుతుంది
👉మూసీ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోంది?: హరీష్‌రావు
మూసీ ప్రాజెక్టులో ఎన్ని నివాసాలను కూల్చారు?
కూల్చిన ఇండ్లకు ఇప్పటి వరకు పునరావాసం ఎంత కల్పించారు?
మూసీకి గోదావరి నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా? లేదా
మొన్న వరదలు వచ్చినపుడు ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తిన విషయం ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేదా?
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చితే బీఆర్‌ఎస్ పోరాటం చేస్తది.
మూసీలో ఖాళీ స్థలాలు ఉన్నాయి.. అక్కడ అభివృద్ధి చేయాలి
👉అసెంబ్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
జూబ్లీహిల్స్ నివాసం నుంచి అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మండలికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ ను కోరనున్న కవిత
👉మూసీకి-మీరాళంకు సంబంధం ఏంటి?: అక్బరుద్దిన్ ఓవైసీ
రెండు మూడు అంశాలను క్లబ్ చేస్తే ఎలా?
అసెంబ్లీ అధికారులు విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు
సభ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి
రెండేళ్ల నుంచి మూసి పేరుతో కాలం గడుపుతుంది
మూసీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అసలు మూసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది?
నాకు తెలిసినంత వరకు అనంతగిరి నుంచి ప్రారంభం అవుతుంది
ప్రభుత్వం అనంతగిరి నుంచి ప్రాజెక్ట్ తీసుకుంటుందా? లేదా?
మూసీ లో ప్రైవేట్ ల్యాండ్ ఎంత ఉంది?
గోదావరి నీళ్లను హిమాయత్, ఉస్మాన్ సాగర్‌లో ఎలా తెస్తారు?
హిమాయత్ సాగర్, హుస్మాన్ సాగర్ కాచిమెంట్ ఏరియా ఎంతో చెప్పాలి?
గతసారి అవసరం లేకుండా హిమాయత్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరిచారు?
ఈ రెండు సాగర్లలో వర్షపు నీళ్లు వస్తాయి.. మరి గోదావరి నీళ్లు తెస్తే ఎలా?
మూసీ ప్రాజెక్ట్ బాబు ఘాట్ వరకు విన్నాను.. కానీ ప్రాజెక్టు వివరాలు సర్కార్ చెప్పడం లేదు.
శాసన మండలి:
👉గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
- బలహీన వర్గాల సంక్షేమంపై గత పదేళ్లలో ఏనాడు ప్రశ్నించలేదు
- 13 కార్పొరేషన్లు ఉండేవి.. తరువాత 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశాం
- స్థలాల సేకరణ చేశాం.. వాటి అభివృద్ధికి నిధులు కేటాయించలేదు
- నిధులు పేపర్‌కే తప్ప గతంలో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు
- గొల్ల కురుమ భవన్‌కు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తన సొంత నిధులతో ఆ భవనాన్ని నిర్మించారు
- ప్రభుత్వం ఏర్పడిన తరువాత బలహీనవర్గాల మంత్రిగా అన్ని కుల సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం
- కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎడ్యుకేషన్,స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం
- బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది
- బలహీన వర్గాలకు సముచిత న్యాయం జరిగేలా మా కార్యాచరణ ఉంది
- పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులలో బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం
- సమగ్రమైన ప్రణాళికతో కొత్త కార్పొరేషన్లకు శాశ్వత సిబ్బందిని నియమిస్తాం
- ధోబీ, కుమ్మరి ప్రత్యేక ప్రణాళికలు తీసుకుంటున్నాం
- గీత కార్పొరేషన్ కాటమయ్య రక్షణ కవచాలు ఇస్తున్నాం
- బలహీన వర్గాల శాఖ మంత్రిగా సామాజిక న్యాయం జరగడానికి రాజకీయాలు అతీతంగా పని చేస్తాం
ప్రశ్నోత్తరాల సమయం:
- హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లోకి పంప్ చేయడానికి ఏర్పాట్లు: శ్రీధర్‌బాబు
- త్వరలోనే డీపీఆర్‌లు తయారు చేస్తాం
- హిమాయత్ సాగర్ నుంచి బాపూఘాట్ వరకు అధ్యయనం
- మూసీ ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ ఆందోళనకు దిగింది. యూరియా కొరతపై చర్చ జరపాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం చేయగా.. స్పీకర్ తిరస్కరించారు. బీఆర్‌ఎస్ నిరసనపై శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఏదైనా డిమాండ్ ఉంటే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రకారం రావాలన్నారు. ప్రతిపక్షాల డిమాండ్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేయడం సరైన పద్ధతి కాదని శ్రీధర్‌బాబు అన్నారు.


