
సాక్షి, రంగారెడ్డి: శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 100 కోట్ల విలువైన లక్ష గజాల అక్రమ రిజిస్ట్రేషన్ విషయంలో రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ క్రమంలో భారీ స్కాం బయటకు వచ్చింది.
వివరాల ప్రకారం.. బాటసింగారం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం ఉంది. ఈ క్రమంలో ప్రజా ప్రయోజనార్ధం శ్రీమిత్ర డెవలపర్స్ వదిలివేసిన లక్ష గజాల భూమిని స్థానిక లీడర్లు ఆక్రమించారు. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్స్‌తో అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగింది. స్థానిక బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, బ్యాంక్ ఉద్యోగి సహా పలువురి పేర్లపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి విచారణ జరపగా.. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్స్‌తో అబ్దుల్లాపూర్‌మెట్‌లో 100 కోట్లు విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదు చేయడంతో దశరథ రామయ్యపైన కేసు నమోదు చేశారు.