ప్లాన్‌తోనే ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ను ముంచేశారు: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు | Ktr Sensational Comments On Cm Revanth Reddy | Sakshi
Sakshi News home page

ప్లాన్‌తోనే ఎంజీబీఎస్‌ బస్టాండ్‌ను ముంచేశారు: కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 27 2025 5:34 PM | Updated on Sep 27 2025 7:51 PM

Ktr Sensational Comments On Cm Revanth Reddy

సాక్షి, వికారాబాద్‌: వచ్చే ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి కొడంగల్‌ నుంచి పోటీ చేయరంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలు రేవంత్‌పై రగిలిపోతున్నారన్నారు. కేటీఆర్ సమక్షంలో కొడంగల్‌కు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు.. బీఆర్ఎస్‌ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను బొంద పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశమన్నారు.

‘‘కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ గెలవాలి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని రేవంత్ బంద్ చేస్తాడు. రేవంత్ రెడ్డి గురించి అందరి కంటే ఎక్కువ కొడంగల్ ప్రజలకే తెలుసు. రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ భూములను.. తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రేవంత్ అవమానించాడు. కొడంగల్ రేవంత్‌రెడ్డి జాగీరా.. కొడంగల్‌కు రేవంత్‌రెడ్డి చక్రవర్తి కాదు. కొడంగల్ ప్రజల ఆగ్రహంలో వచ్చే ఎన్నికల్లో రేవంత్, కాంగ్రెస్‌ పార్టీ కొట్టుకుపోతుంది.

..తెలంగాణకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. కొడంగల్‌కు తిరుపతిరెడ్డి ముఖ్యమంత్రి. వార్డు మెంబర్ కూడా కాని తిరుపతి రెడ్డికి.. కలెక్టర్, ఎస్పీ వంగి వంగి దండాలు పెడుతున్నారు. అన్నదమ్ములు జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రేవంత్,  తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారమే ఎంబీబీఎస్ బస్టాండ్‌ను ముంచాడు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను భయపెట్టేందుకే ఒకేసారి 15గేట్లు తెరిచారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఎంబీబీఎస్ బస్టాండ్ మునిగింది. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుంది’’ అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement