వెంటబడి.. చొరబడి | Iran Seizes India-Bound Ship in Strait of Hormuz | Sakshi
Sakshi News home page

వెంటబడి.. చొరబడి

Apr 24 2026 4:40 AM | Updated on Apr 24 2026 6:18 AM

Iran Seizes India-Bound Ship in Strait of Hormuz

గుజరాత్‌కు రావాల్సిన నౌకను స్వాధీనం చేసుకున్న వీడియోను బహిర్గతం చేసిన ఐఆర్‌జీసీ

టెహ్రాన్‌: దుబాయ్‌ నుంచి బయల్దేరి హార్మూజ్‌ జలసంధి మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు క్షేమంగా రావాల్సిన కంటైనర్‌ నౌక ‘ఎపామినోండాస్‌’ను ఇరాన్‌ బలగాలు స్వా«దీనం చేసుకున్న వీడియో తాజాగా బహిర్గతమైంది. లైబీరియా జెండాతో వస్తున్న ‘ఎపామినోండాస్‌’పైకి ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) నేవీ బలగాలు మెరుపువేగంతో దాడిచేసి తమ వశం చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్‌ అవుతోంది. 

ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్‌ మైళ్లదూరంలో హార్మూజ్‌ జలాల్లో ఉన్న నౌకపైకి ఐఆర్‌జీసీ నేవీ గన్‌బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వెంటనే గన్‌బోట్లలో నేవీ కమెండోలు మెరుపువేగంతో నౌక సమీపానికి చేరుకున్నారు. నౌక పక్కల వైపు ఉండే చిన్నపాటి ప్రవేశ ద్వారం గుండా లోపలికి చొరబడ్డారు. ఈ దురాక్రమణపర్వం మొత్తం నేవీ వాళ్ల డ్రోన్‌ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

మాస్క్ లు ధరించిన కమెండోలు రైఫిళ్లు ఇతర మారణాయుధాలతో నౌకలోకి చొరబడి తమను ప్రతిఘటించే సాయుధులకోసం వెతికారు. నౌకలో సాయుధుల ఎవరూ లేకపోవడంతో నేరుగా నౌక ఇంజిన్‌ రూమ్‌లోకి వెళ్లి దాని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను తమ వశంచేసుకున్నారు. తర్వాత నౌక తమ అ«దీనంలోకి వచి్చందని అధికారికంగా ప్రకటించారు. తర్వాత నౌకను ఇరాన్‌ తీరం వైపు మళ్లించారు.

 తీరానికి తీసుకెళ్లాక నౌకను తనిఖీచేసి సరకులో ఏమైనా అక్రమ, చట్టబద్ధ వస్తువులున్నాయా లేదా అనేది తనిఖీచేస్తారు. వాస్తవానికి ఈ నౌక రాకపోకలకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులులేవని ఇరాన్‌ నేవీ ప్రకటించింది. నౌకను స్వా«దీనంచేసుకునే క్రమంలో ఎపామినోండాస్‌ పైకి ఇరాన్‌ కమెండోలు కాల్పులు జరిపి గ్రనేడ్లు విసిరేశారు. దీంతో నౌకలోని ప్రధానభాగమైన బ్రిడ్జ్‌(సెంట్రల్‌ కమాండ్‌ సెంటర్‌) పాక్షికంగా దెబ్బతింది. కానీ నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు.  

దెబ్బకు దెబ్బ... 
హార్మూజ్‌లో, హిందూ మహాసముద్రంలో రెండు ఇరాన్‌ నౌకలను అమెరికా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇరాన్‌ కార్గో నౌక ‘టౌస్కా’స్వాధీనపరంపర తాలూకు వీడియోలను మీడియాకు అందజేశాయి. ఇరాన్‌ నౌకలను సులభంగా తమ వశంచేసుకున్నామని ఆ వీడియోల్లో అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఐఆర్‌జీసీ నేవీ బలగాలు తాము సైతం విదేశీ నౌకలను స్వా«దీనంచేసుకోగలమని నిరూపించాలనుకున్నాయి. ఇందులోభాగంగా ‘ఎపామినోండాస్‌’, ‘యుఫోరియా’, ‘ఎంఎస్‌సీ ఫ్రాన్సిస్కా’నౌకలను స్వా«దీనం చేసుకుని తమ సత్తా చాటాయని తెలుస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement