భారత్‌కు చేరిన చినూక్‌ హెలికాప్టర్లు

chinook Helicopters Arrive India - Sakshi

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్‌ సంస్థ నుంచి భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌)కు మొదటి దఫా అందాల్సిన నాలుగు చినూక్‌ సైనిక హెలికాప్టర్లు భారత్‌కు చేరాయి. గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయానికి ఆదివారం చేరిన నాలుగు సీహెచ్‌47ఎఫ్‌(ఐ) రకం హెలికాప్టర్లను త్వరలోనే చండీగఢ్‌ ఐఏఎఫ్‌ స్థావరానికి తరలిస్తామని బోయింగ్‌ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. బలగాలను, సైనిక సామగ్రిని, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి. 2015లో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్లు, 15 చినూక్‌ హెలికాప్టర్లను భారత్‌కు బోయింగ్‌ సమకూర్చాల్సి ఉంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top