ప్రత్యేక రైళ్ల సమయాల్లో మార్పు..

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే పరి«ధిలో నడుస్తున్న పలు స్పెషల్ రైళ్ల వేళలు మారినట్టు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మార్పు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయన్నారు.
►రాయగడ–విశాఖపట్నం (08507) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రోజూ ఉదయం 5.45 గంటలకు రాయగడలో బయల్దేరి అదే రోజు ఉదయం 10గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08508) విశాఖపట్నంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.05 గంటలకు రాయగడ చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, పార్వతీపురం టౌన్ స్టేషన్‌లలో ఆగుతుంది.
►పలాస–విశాఖపట్నం (08531) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజు పలాసలో ఉదయం 5గంటలకు బయల్దేరి అదేరోజు ఉదయం 9.25గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (08532) విశాఖలో ప్రతిరోజు సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి రాత్రి 10గంటలకు పలాస చేరుకుంటుంది. ఈ రైలు ఇరుమార్గాలలో సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళంరోడ్డు, తిలారు, నౌపడ స్టేషన్‌లలో ఆగుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి