సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు 

Special trains for Sankranti - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌–హైదరాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 

♦ సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ (07021) రైలు ఈ నెల 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07022) ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

♦ హైదరాబాద్‌–కాకినాడ టౌన్‌ (07023) రైలు ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) ఈ నెల 13న శనివారం రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top