
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దీపావళి పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా పూర్ణ–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పూర్ణ–తిరుపతి ప్రత్యేక వారాంతపు రైలు (07607) నవంబర్ 1, 8, 15, 22, 29 తేదీలలో ప్రతి సోమవారం మధ్యాహ్నం 1 గంటకు పూర్ణలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07608) నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో ప్రతి మంగళవారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.25 గంటలకు పూర్ణ చేరుకుంటుంది.