పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు | South Central Railway Special Trains Runs On Several Routes | Sakshi
Sakshi News home page

పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు

May 31 2022 2:12 AM | Updated on May 31 2022 2:12 AM

South Central Railway Special Trains Runs On Several Routes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విశాఖపట్టణం–సికింద్రాబాద్‌ (08579/ 08580) వీక్లీ స్పెషల్‌ ట్రైన్‌ జూన్‌ 1వ తేదీ నుంచి 30 వరకు విశాఖపట్టణం– మహబూబ్‌ నగర్‌ (08585/08586) వీక్లీ స్పెషల్‌ ప్రతి మంగళ వారం విశాఖ నుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుం టుంది.

కాచిగూడ– తిరుపతి (07297/ 07298) స్పెషల్‌ ట్రైన్‌ జూన్‌ 1వ తేదీ రాత్రి 10.20 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరుపతికి చేరుకుం టుంది. హైదరాబాద్‌– తిరుపతి (07433/ 07434) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీ ల్లో సాయంత్రం 6.40కి నాంపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరు కుంటుంది. తిరుగు ప్రయాణంలో జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.25కు బయల్దేరి మర్నాడు ఉదయం 8.30కు నాంపల్లికి చేరుకుంటుంది.   

Advertisement
 
Advertisement
Advertisement