విజయవాడ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవే..

Special Trains To Bangalore Via Vijayawada - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

- సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06549) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 5న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06550) ఈ నెల 6న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది. 

- అలాగే, సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06521)రైలు ఈ నెల 3న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06522) ఈ నెల 4న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది. 

- సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–కాచిగూడ(06523) ఈ నెల 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06524) ఈ నెల 4, 6 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరుకు చేరుకుంటుంది.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top