శబరిమలకు ప్రత్యేక రైళ్లు 

Sabarimala Special Trains from Telangana  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పలు ప్రాంతాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌–కొల్లాం (07129/07130) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 26, డిసెంబర్‌ 3 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.55కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

నర్సాపూర్‌–కొట్టాయం (07119/07120) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 26, డిసెంబర్‌ 3 తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 27, డిసెంబర్‌ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9కి నర్సాపూర్‌కు చేరుకుంటుంది.

కాచిగూడ–కొల్లాం (07123/07124) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 22, 29, డిసెంబర్‌ 6 తేదీల్లో సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు రాత్రి 11.55 గంటలకి కొల్లాంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో తెల్లవారు జామున 2.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30కి కాచిగూడ చేరుకుంటుంది.

కాకినాడ–కొట్టాయం (07125/07126) ఈనెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10కి కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 12.30కి బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–కొల్లాం (07127/07128) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 24, డిసెంబర్‌ 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకి బయల్దేరి మర్నాడు సాయంత్రం 7.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 11కి బయల్దేరి రెండవ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top