Indian Railways: Check Timings Of Tirupati-Bilaspur And Puri Special Train - Sakshi
Sakshi News home page

తిరుపతి –బిలాస్‌పూర్, పూరీల మధ్య ప్రత్యేక రైళ్లు

Feb 4 2021 4:48 PM | Updated on Feb 5 2021 5:09 PM

Special Train From Tirupati to Bilaspur, Puri - Sakshi

తిరుపతి–బిలాస్‌ పూర్‌ ప్రత్యేక రైలు(07481) ఈ నెల 7వ తేదీ నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది.

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి–బిలాస్‌ పూర్‌ ప్రత్యేక రైలు(07481) ఈ నెల 7వ తేదీ  నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలు దేరుతుంది. సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని,  మరుసటి రోజు సాయంత్రం 5.25 గంటలకు బిలాస్‌పూర్‌ చేరు కుంటుంది.

తిరుగు ప్రయాణంలో  (07482) 9వ తేదీ నుంచి ప్రతి మంగళ, శనివారాలలో మధ్యాహ్నం 3.35గంటలకు బిలాస్‌పూర్‌లో బయలుదేరి  మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

అలాగే తిరుపతి–పూరి మధ్య నడిచే ప్రత్యేక రైలు (07479) 8వ తేదీ నుంచి ప్రతి సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 10.50 గంటలకు తిరుపతిలో బయలుదేరి, సాయంత్రం 5.50కి విజయవాడ చేరుకుని,  మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు పూరి చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో (07480) 10వ తేదీ నుంచి ప్రతి సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో సాయంత్రం 6.30 గంటలకు పూరిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11.55కి విజయవాడ చేరుకుని, అదే రోజు రాత్రి 10.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 

చదవండి:
ప్రైవేటు‌ చేతుల్లోకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?..

Advertisement
 
Advertisement
Advertisement