
సాక్షి, హైదరాబాద్: శబరి మలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలి పారు. వివరాలు.. కాచిగూడ–కొల్లాం (07187/07188) స్పెషల్ ట్రైన్ ఈ నెల 11వ తేదీ సోమవారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 13వ తేదీ బుధవారం ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45కు కాచిగూడకు చేరుకుంటుంది. సికింద్రాబాద్–కొల్లాం (07193/ 07194)స్పెషల్ ట్రైన్ ఈనెల 13వ తేదీ బుధవారం ఉదయం 10.40 గంటలకు బయ లుదేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంట లకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయా ణంలో 15వ తేదీ శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 9.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.