సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు  | Special trains for Sankranti: telangana | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు 

Jan 3 2024 3:26 AM | Updated on Jan 3 2024 3:26 AM

Special trains for Sankranti: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా రైళ్ల వివరాలిలా..  

► సికింద్రాబాద్‌–బ్రాహ్మణ్‌పూర్‌–వికారాబాద్‌ (07089/07090) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 7, 8, 14, 15 తేదీల్లో రాత్రి 7.45కు సికింద్రాబాద్‌  నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15కు బ్రాహ్మణ్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.30గంటలకు బ్రాహ్మణ్‌పూర్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది. 

► వికారాబాద్‌–బ్రాహ్మణ్‌పూర్‌–సికింద్రాబాద్‌ (07091/07092) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో సాయంత్రం 6 గంటలకు వికారాబాద్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజుఉదయం 11.15 గంటలకు బ్రాహ్మణ్‌పూర్‌ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం 12.30కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

► విశాఖపట్టణం–కర్నూల్‌ (08541/08542) ప్రత్యేక రైలు ఈ నెల 10,11, 17, 18, 24, 25 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.35కు కర్నూల్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. 

► శ్రీకాకుళం–వికారాబాద్‌ (08547/08548) స్పె షల్‌ ట్రైన్‌ ఈ నెల 12, 13, 19, 20, 26, 27 తేదీ ల్లో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9 గంటలకు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 కు వికారాబాద్‌కు చేరుకుంటుంది. 

► సికింద్రాబాద్‌–తిరుపతి (02764/02763) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 10, 11, 17,18 తేదీల్లో సాయంత్రం 6.40 కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45కు చేరుకుంటుంది.తిరుగుప్రయాణంలో సాయంత్రం 5.15కు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గం.కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. 

► సికింద్రాబాద్‌–కాకినాడ (07271/07272) ప్ర త్యేక రైలు ఈనెల 12న రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు చే రుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 8.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉద యం 8.30 కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement