ఏప్రిల్‌ 1 నుంచి 12 కొత్త రైళ్లు | 12 new trains from April 1st | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 నుంచి 12 కొత్త రైళ్లు

Mar 13 2021 4:51 AM | Updated on Mar 13 2021 4:51 AM

12 new trains from April 1st - Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో రద్దయిన రైళ్లను ఒకొక్కటిగా పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతు న్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధ రించనున్నారు. విజయవాడ–సాయినగర్‌ షిర్డి– విజయవాడ (07207/07208) మధ్య రెండు రైళ్లు, అలాగే విజయవాడ–సికింద్రాబాద్‌–విజయవాడ (02799/02800), విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం (02739/02740), గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు (07239/0740), గూడూరు –విజయవాడ–గూడూరు (02734/02644), నర్సాపూర్‌–ధర్మవరం–నర్సాపూర్‌ (07247/ 07248) మార్గాల్లో రెండేసి రైళ్ల చొప్పున ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరిస్తున్నారు. షిర్డి, సికింద్రాబాద్, విశాఖపట్నం, ధర్మవరం, గూడూరులకు విజయవాడ మీదగా రైళ్లు రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే నడుపుతున్నారు.

రెగ్యులర్‌ రైళ్ల కోసం ఎదురుచూపులు
గతంలో 250 రైళ్లు విజయవాడ జంక్షన్‌ మీదగా ప్రతి రోజూ నడిచేవి. ప్రస్తుతం నడుస్తున్న 110 రైళ్లకు అడ్వాన్సు బుకింగ్‌ ఇస్తున్నారు. ఈ బుకింగ్‌లు నెల రోజులు ముందుగానే అయిపోతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరిస్తున్నారే కానీ ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం పునరుద్ధరించలేదు. రెగ్యులర్‌ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement