50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..! | 50-Year-Old Woman Returns to College After 35 Years | Sakshi
Sakshi News home page

50 ఏళ్ల వయసులో కాలేజ్‌కి వెళ్తున్న మహిళ..!

Jun 21 2026 10:22 AM | Updated on Jun 21 2026 11:21 AM

50-Year-Old Woman Returns to College After 35 Years

చదువుకి వయసు పరిమితి కాదని చాలామంది నిరూపిస్తున్నారు. అదే కోవలోకి మరో మహిళ వచ్చింది. అందుకు సంబంధించి వీడియోని నెట్టింట షేర్‌ చేసింది.. ఆ వీడియో ‘గైస్‌ ఈ రోజు నాకు పరీక్ష ఉంది’ అంటూ మొదలవుతుంది. ఒక మహిళ తనకంటే చిన్న వయసు ఉన్న విద్యార్థులతో పరీక్ష కేంద్ర వైపుకి వెళ్తున్నట్లు చెబుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

దశాబ్దాల క్రితం చదువు వదిలేసిన ఆమె పరీక్షకు సిద్దమవుతున్నప్పుడు సహజంగా విద్యార్థులు పడినట్లుగానే చిన్నపాటి టెన్షన్‌ ఉందని చెబుతోంది వీడియోలో. తను బ్యాక్‌లాగ్ పేపర్‌ ఒకటి క్లియర్‌ చేయడానికి వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు ఆమె ఈ వీడియోకి ‘చదువుకోవడానికి వయసు పరిమితి కాదు’ అనే క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ చేసింది. 

ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకర్షించింది. అంతేగాదు సుదీర్ఘ విరామం తర్వాత చదువుని కొనసాగించినందుకు చాలామంది ఆ మహిళను ప్రశంసించారు. మరికొందరు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకమని, నేర్చుకోవడానికి లక్ష్యాలను సాధించడానికి ఎప్పుడు ఆలస్యం కాదని ఆమె ఉదంతం నిరూపిస్తోందంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: మేమున్నాం అనే భరోసా చాలు)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement