చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు | Cherlapalli-Tirupati special trains: Telangana | Sakshi
Sakshi News home page

చర్లపల్లి–తిరుపతి ప్రత్యేక రైళ్లు

Apr 6 2025 5:58 AM | Updated on Apr 6 2025 5:58 AM

Cherlapalli-Tirupati special trains: Telangana

సాక్షి, హైదరాబాద్‌: వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి బై వీక్లీ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్‌  తెలిపారు. 

ఈ మేరకు చర్లపల్లి–తిరుపతి (07017/07018) రైలు ఈ నెల 6, 11, 13, 18, 20, 25, 27, మే 2, 4, 9, 11, 16, 18, 23, 25, 30 తేదీల్లో రాత్రి 9.35 గంటలకు బయలుదేరి.. మర్నాడు ఉదయం 10.10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 7, 12, 14, 19, 21, 26, 28, మే, 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31 తేదీల్లో సాయంత్రం 4.40 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి.. మర్నాడు ఉదయం 7.10 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement