పట్టాలెక్కనున్న మరిన్ని స్పెషల్‌ రైళ్లు

Railways To Run More Special Trains - Sakshi

తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని స్పెషల్‌ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠీ ఒక ప్రకటనలో తెలిపారు.

డిబ్రూఘడ్‌–కన్యాకుమారి(05906) వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 27 నుంచి ప్రారంభమై ప్రతి శనివారం రాత్రి 7.25 గంటలకు డిబ్రూఘడ్‌లో బయలుదేరి మూడో రోజు
(సోమవారం) మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మంగళవారం రాత్రి 10 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది.  
ఈ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌(05905) తిరుగు ప్రయాణంలో కన్యాకుమారిలో మార్చి 4 నుంచి ప్రారంభమై ప్రతి గురువారం సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి, మరసటి రోజు రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి ప్రతి ఆదివారం రాత్రి 8.50 గంటలకు డిబ్రూఘడ్‌ చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైల్‌ 1–సెకండ్‌ ఏసీ, 4–థర్డ్‌ ఏసీ, 11–స్లీపర్‌ క్లాస్, 3–సెకండ్‌ క్లాస్, 1 పాంట్రీకార్, 2–జనరేటర్‌ మోటార్‌ కార్స్‌ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తుంది.
చదవండి:
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన తహసీల్దార్‌   
పనులన్నీ మానేసి.. గ్రామస్తులంతా కదిలొచ్చి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top