హైదరాబాద్‌–తిరుపతి ప్రత్యేక రైళ్లు  | Hyderabad To Tirupati Special Trains | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌–తిరుపతి ప్రత్యేక రైళ్లు 

May 15 2022 2:31 AM | Updated on May 15 2022 2:31 AM

Hyderabad To Tirupati Special Trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌–తిరుపతి (07433/07434) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 17న సాయంత్రం 6.40 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50కి తిరుపతికి చేరుకుంటుంది.

తిరుగుప్రయాణంలో 19వ తేదీ రాత్రి 8.25 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. తిరుపతి–కాకినాడ (07435/07436) స్పెషల్‌ ట్రైన్‌ ఈనెల 18వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 19వ తేదీ ఉదయం 7.30 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 6.40కి కాకినాడ చేరుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement