దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు | Sakshi
Sakshi News home page

దసరా పండుగకు ప్రత్యేక రైళ్లు

Published Fri, Oct 8 2021 4:04 AM

Special trains for Dussehra festival Andhra Pradesh - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): సికింద్రాబాద్‌–నర్సాపూర్‌ (07456/ 07455 ) స్పెషల్‌ ట్రైన్‌  ఈ నెల 14వ తేదీ రాత్రి 10.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 

సికింద్రాబాద్‌–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07053) 14న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07054) 17న రాత్రి 8.45 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.  

సికింద్రాబాద్‌–అగర్తల ప్రత్యేక రైలు (07030) 11న సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి నాలుగోరోజు (గురువారం) తెల్లవారుజామున 3 గంటలకు అగర్తల చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07029) 15న (శుక్రవారం) ఉదయం 6.10 గంటలకు అగర్తలలో బయలుదేరి, ఆదివారం మధ్యాహ్నం 2.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement