
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ఆగస్టులో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమ, శనివారాల్లో తిరుపతి నుంచి చర్లపల్లికి (07018), ప్రతి శుక్ర, శని వారాల్లో చర్లపల్లి నుంచి తిరుపతికి (07017) రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు మల్కాజిగిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్‌న గర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడి పత్రి, ఎరగ్రుంట, కడప, ఒంటిమిట్ట, రాజంపే ట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి తిరుపతికి రైలు (07251), ప్రతి గురువారం తిరుపతి నుంచి చర్లపల్లికి రైలు (07252) రైళ్లు నడువను న్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.