పండుగల సీజన్‌లో ప్రత్యేక రైళ్లు | Special Trains During Dasara And Deepavali Festive Season, Check Out The Details Inside | Sakshi
Sakshi News home page

పండుగల సీజన్‌లో ప్రత్యేక రైళ్లు

Sep 12 2024 5:19 AM | Updated on Sep 12 2024 1:10 PM

Special trains during festive season

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ):  దసరా, దీపావళి పండుగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విజయవాడ మీదుగా తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. తిరుపతి–శ్రీకాకుళం రోడ్డు (07442) ప్రత్యేక వారాంతపు రైలు అక్టోబర్‌ 6 నుంచి నవంబర్‌ 10 వరకు ప్రతి ఆదివారం నడవనుంది. 

అదే విధంగా శ్రీకాకుళం రోడ్డు–తిరుపతి (07443) రైలు అక్టోబర్‌ 7 నుంచి నవంబర్‌ 11 వరకు ప్రతి సోమవారం నడవనుంది. రెండు మార్గాల్లో ఈ రైలు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్‌లలో ఆగుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement