నెల ముందు నుంచే ‘రాజధాని’ బుకింగ్‌

Tickets for special trains on Rajdhani routes can be bought 30 days in advance - Sakshi

న్యూఢిల్లీ: ఇకపై ప్రత్యేక రాజధాని రైళ్లలో టిక్కెట్లు నెల రోజుల ముందు నుంచే అందుబాటులో ఉంటాయని, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. గతంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారానే ఈ టికెట్లను బుక్‌ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పోస్ట్‌ ఆఫీసులు సహా అన్ని కంప్యూటరైజ్డ్‌ పీఆర్‌ఎస్‌ కౌంటర్లు, యాత్రి టికెట్‌ సువిధ కేంద్రాలు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ల ద్వారా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. గతంలో వారం ముందు నుంచి మాత్రమే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌కు అవకాశం ఉండేది. అది ఇప్పుడు 30 రోజులకు పెంచారు. అయితే, తత్కాల్‌ బుకింగ్‌కు అవకాశం లేదు. వెయిటింగ్‌ లిస్ట్‌ లోని వారిని ప్రయాణానికి అనుమతించరు. ప్రయాణీకుల తొలి జాబితాను రైలు ప్రారంభానికి 4 గంటల ముందు, రెండో జాబితాను 2 గంటల ముందు సిద్ధం చేస్తారు. తొలి, మలి జాబితాలను సిద్ధం చేసే మధ్య కాలంలో కరంట్‌ బుకింగ్‌ ఉంటుంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top