breaking news
Ticket booking centers
-
నెల ముందు నుంచే ‘రాజధాని’ బుకింగ్
న్యూఢిల్లీ: ఇకపై ప్రత్యేక రాజధాని రైళ్లలో టిక్కెట్లు నెల రోజుల ముందు నుంచే అందుబాటులో ఉంటాయని, రైల్వే స్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారానే ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు సహా అన్ని కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్లు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, ఐఆర్సీటీసీ అధీకృత ఏజెంట్ల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో వారం ముందు నుంచి మాత్రమే అడ్వాన్స్ రిజర్వేషన్‌కు అవకాశం ఉండేది. అది ఇప్పుడు 30 రోజులకు పెంచారు. అయితే, తత్కాల్ బుకింగ్‌కు అవకాశం లేదు. వెయిటింగ్ లిస్ట్ లోని వారిని ప్రయాణానికి అనుమతించరు. ప్రయాణీకుల తొలి జాబితాను రైలు ప్రారంభానికి 4 గంటల ముందు, రెండో జాబితాను 2 గంటల ముందు సిద్ధం చేస్తారు. తొలి, మలి జాబితాలను సిద్ధం చేసే మధ్య కాలంలో కరంట్ బుకింగ్ ఉంటుంది. -
తత్కాల్..గోల్మాల్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): తత్కాల్లో ఒక్క టికెట్ బుక్ చేయాలంటేనే తలప్రాణం తోకకొస్తుంది. ఒక ఐపీ అడ్రస్ నుంచి నెలకు 5 కొనాలనే నిబంధన ఉంది. అయితే ఐఆర్సీటీసీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను, లొసుగులను గమనించిన ఓ ముఠా.. నకిలీ సాఫ్ట్వేర్ ఏఎన్‌ఎంఎస్‌ను రూపొందించి తత్కాల్ బుకింగ్ సమయంలో కొన్ని వందల టికెట్లు బుక్ చేస్తోంది. కన్ఫర్మ్ టికెట్లు బుక్ చేసినందుకు గానూ ప్రయాణికుల నుంచి డిమాండ్‌ను బట్టి ఒక్కో టికెట్‌కు రూ. 200 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తోంది. ఈ ముఠా దందా ఇలా సాగుతుంటే సాధారణ ప్రయాణికులు మాత్రం.. ఒక్క టికెట్ కూడా బుక్ చేయలేక నానాతంటాలు పడుతున్నారు. దీనిపై ఫిర్యాదులందుకున్న రైల్వే భద్రతా దళం నిత్యం తనిఖీలు నిర్వహిస్తోంది. నకిలీ సాఫ్ట్‌వేర్‌తో ప్రయాణికులను మోసగిస్తున్న ఏజెంట్లను అరెస్ట్ చేస్తోంది. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఏదో ఓ చోట వెలుగు చూస్తూనే.. ఉన్నాయి. మూడు నెలలుగా విస్తృత దాడులు •అక్టోబర్ 26న ఆరీ్పఎఫ్ సిబ్బంది అల్లిపురంలోని అయ్యప్ప ఇంటర్నెట్ సెంటర్‌పై దాడి చేసి, నిర్వాహకుడు తవిటి నాయుడును అరెస్ట్ చేశారు. అలాగే గాజువాకలోని ఐ ఫ్రెండ్స్ నెట్ సెంటర్, అగనంపూడిలోని ఫ్రెండ్స్ డాట్ కామ్ ఇంటర్నెట్ అండ్ మీసేవ, చినముషిడివాడలోని ఓంకార్ ఆన్లైన్ సర్వీసెస్, అరసవల్లిలోని శ్రీనివాస మల్టీమీడియా, పార్వతీపురంలోని స్టార్ ఇంటర్నెట్ అండ్ జిరాక్స్, మర్రిపాలెంలోని స్పేస్ సిటీ ఇంటర్నెట్ సరీ్వసెస్‌లో దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకుల నుంచి రూ.3,36,680 విలువ చేసే 198 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు. •నవంబర్ 3వ తేదీన విజయనగరంలోని మీ సేవ కేంద్రం, చీపురుపల్లిలోని ఏ టు జెడ్ ఆన్లైన్ సరీ్వస్, సబ్బవరంలోని గ్రేస్ ఇంటర్నెట్ అండ్ డీటీపీ, గోపాలపట్నంలోని విశ్వాస్ ఇంటర్నెట్ కేఫ్ అండ్ ట్రావెల్స్‌పై దాడులు చేశారు. ఈ కేంద్రాల నిర్వాహకులను అరెస్ట్ చేసి, వీరి నుంచి రూ. 2.26 లక్షల విలువ చేసే 195 ఇ–టికెట్లను స్వాదీనం చేసుకున్నారు. •నవంబర్ 28న శ్రీకాకుళంలోని ఎస్.ఎస్.ట్రావెల్స్, జగదీష్ టూర్స్ అండ్ ట్రావెల్స్, ఎస్.ఎస్.ట్రావెల్స్( కళింగ రోడ్ జంక్షన్), అయ్యప్ప ట్రావెల్స్‌పై దాడులు చేసి, నిర్వాహకులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 3,57,599 విలువ చేసే 203 ఇ–టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. •ఈ నెల 10వ తేదీన జరిపిన దాడుల్లో నకిలీ సాఫ్ట్వేర్ గుట్టును రట్టు చేశారు. దువ్వాడలోని ఎస్పీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై దాడులు చేసి 582 ఇ–టికెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.31 లక్షలు ఉంటుంది. అలాగే తాటిచెట్లపాలెంలో యు.దుర్గారావును అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.3.52 లక్షల విలువ చేసే 129 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సాఫ్ట్‌వేర్‌ను గుర్తించిన ఆర్ఫీఎఫ్ ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్లు పి.ఎస్.రావు, ఆర్.కె.రావులు ఈ నెల 10న దువ్వాడలోని ఎస్పీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌పై జరిపిన దాడుల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. నకిలీ ఏఎన్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌తో ఐఆర్సీటీసీ ఇ–టికెట్ పోర్టల్‌ను హ్యాక్ చేసి తత్కాల్ టికెట్లు బుక్ చేస్తున్నట్టు గుర్తించారు. కేంద్రం నిర్వాహకుడు సమీర్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని.. రూ.11.31 లక్షలు విలువ చేసే 582 ఇ–టికెట్లను స్వా«దీనం చేసుకున్నారు. గడిచిన మూడు నెలల కాలంలో ఆర్పీఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో దాడులు చేసి రూ.లక్షల విలువైన టికెట్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు స్వా«దీనం చేసుకున్నారు. 17 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డిసెంబర్ 10న అరెస్టయిన సమీర్‌కుమార్ ప్రధాన సూత్రధారుడిగా గుర్తించారు. అతను పరవాడలోని ఫార్మా కంపెనీలో పనిచేస్తూ.. దువ్వాడలో ఎస్పీ టూర్ అండ్ ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. అతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఐఆర్‌సీటీ సీయే కారణమా? ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వ్యాపార విస్తరణలో భాగంగా నగరాల్లో ప్రిన్సిపాల్ సరీ్వస్ ప్రొవైడర్స్(పీఎస్పీ)కు కాంట్రాక్ట్ ఇస్తోంది. ఈ పీఎస్పీలు ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా టికెట్లు అమ్మకాలు సాగిస్తుంటారు. ఈ ప్రక్రియ అంతా తత్కాల్ విడుదలైన కేవలం15 నిమిషాల్లో ముగుస్తుంది. అందుకే ఆ సమయంలో సాధారణ ప్రయాణికులు తమ ఫోన్ల నుంచి గానీ, కంప్యూటర్ల నుంచి టికెట్లు బుక్ చేసుకుందామంటే అవకాశం ఉండడం లేదు. ఏ యాప్ నుంచి కూడా ఈ 15 నిమిషాలు వ్యక్తిగత యూజర్ ఐడీలు ఉన్న వారికి టికెట్లు లభించవు. కారణం వారంతా ఆ సమయంలో ఐఆర్సీటీసీ సైట్‌ను తమ స్వా«దీనంలో ఉంచుకుంటారు. తీరా 15 నిమిషాలు అయ్యే సరికి తత్కాల్ టికెట్లన్నీ అయిపోతాయి. వాస్తవానికి రైల్వే టికెట్లు బుక్ చేయాలంటే ఆ శాఖ నుంచి ఆ«దీకృత అనుమతి పొంది ఉండాలి. కానీ ఈ పీఎస్పీలు వీరికి అటువంటి అనుమతుల్లేకుండానే వ్యక్తిగత యూజర్ ఐడీలతో అకౌంట్లు సృష్టిస్తుంటారు. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ యూజర్ ఐడీలతో వేగంగా వీరు తత్కాల్ టికెట్లు బుక్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రయాణికులు తమ అవసరాలు తీరేందుకు వేరే దారి లేక ఇటువంటి వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక టికెట్‌కు డిమాండ్‌ను బట్టి రూ.200 నుంచి రూ. 1000 వరకు కూడా సమర్పించుకుంటున్నారు. పండగ వేళల్లో, రద్దీ సమయాల్లో అనధికార ఏజెంట్లు భారీ మొత్తంలో ప్రయాణికుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. ఈ దందాకు ఓ రకంగా ఐఆర్సీటీసీ కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా.. నకిలీల ఆటకట్టించేందుకు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీ వాస్తవ నడుంబిగించారు. తమ సిబ్బందితో తరచూ దాడులు చేయిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. నకిలీ సాఫ్ట్వేర్ ఏఎన్‌ఎంఎస్‌ను అభివృద్ధి చేసిన వారిని పట్టుకునేందుకు ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. దీని వెనుక పెద్ద ముఠానే ఉందని, త్వరలోనే వీరిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. -
అక్రమార్కులకు ‘పండుగ’
⇒ ఏటీబీల నిలువు దోపిడీ ⇒కృత్రిమ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లు ⇒టిక్కెట్ బుకింగ్ కేంద్రాలపై నిఘా ⇒ రంగంలోకి ప్రత్యేక బృందాలు సాక్షి, సిటీబ్యూరో: సొంత ఊళ్లకు వెళ్లే నగర వాసుల సంక్రాంతి సంబరాల సంగతి ఎలా ఉన్నా...ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్, టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలు మాత్రం అక్రమార్జనతో ‘పండగ’ చేసుకుంటున్నాయి. సాధారణ చార్జీలపై 50 శాతం అదనపు భారాన్ని మోపుతూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ... పండుగకు వారం, పది రోజుల ముందు నుంచే చార్జీలను అమాంతంగా రెండింతలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికుల జేబులు లూఠీ చేస్తున్నారు. వీరికి ఏమాత్రం తీసిపోమనే రీతిలో ఏజెన్సీలు సైతం ప్రయాణికులపై ప్రతాపం చూపుతున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నాయి. సాధారణంగా ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీల్లో కనిపించే ఇలాంటి అక్రమ వ్యాపార ధోరణి కొంతకాలంగా ఆర్టీసీ అధీకృత టిక్కెట్ బుకింగ్ ఏజెన్సీలకూ విస్తరించింది. నగరంలోని వందలాది ఏటీబీ కేంద్రాలలో కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారం ఆర్టీసీపై ప్రయాణికుల నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. బినామీ పేర్లతో బుకింగ్ పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రధానరూట్లలో బినామీ పేర్లతో సీట్లు బుక్ చేస్తున్నారు. నిజమైన ప్రయాణికులు బుకింగ్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే సీట్లు నిండిపోయాయని, ఎవరైనా రద్దు చేసుకుంటే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే ఒక్కో సీటుపైన రూ.100 అదనంగా చెల్లిస్తే రద్దు చేసుకున్న ప్రయాణికుల స్థానంలో సీట్లు ఇస్తామని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితిలో చాలా మంది ఇలా అదనంగా చెల్లించి వెళ్లవలసి వస్తోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఏకంగా రూ.400 అదనంగా చెల్లించవలసిందే. ఏటా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతూనే ఉంది. ఈసారి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ 5,560 ప్రత్యేకబస్సులను ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 13 వరకు ఈ బస్సులు విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలు, కడప, ఆదిలాబాద్, బెల్లంపల్లి, నిజామాబాద్, బెంగళూర్, చెన్నై, తదితర ప్రాంతాలకు బయలుదేరుతాయి. రెగ్యులర్‌గా వెళ్లే బస్సులన్నీ నిండిపోయాయి. సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే వాళ్లకు ప్రత్యేక బస్సులు తప్ప మరో అవకాశం లేదు. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే నిండిపోవడంతో ప్రయాణికులకు ఆర్టీసీ బస్సులే శరణ్యం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీ, ప్రయాణికుల అవసరాల దృష్ట్యా చాలా వరకు దూర ప్రాంత బస్సులు ఏటీబీ కేంద్రాల నుంచే బయలుదేరుతాయి. దీంతో వీటి నిర్వహణ, ప్రయాణికుల భర్తీ వంటి వాటిపైన ఏటీబీల ఆధిపత్యమే కొనసాగుతోంది. ప్రత్యేక నిఘా ఇలా ఉండగా.. అక్రమాలకు పాల్పడే ఏటీబీ ఏజెంట్లపై నిఘా పెట్టినట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు చెప్పారు. ప్రత్యేక బస్సుల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లలో భాగంగా ఏటీబీ ఏజెంట్లు టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని, ఇవి ఏటీబీ కేంద్రాలపై నిఘా ఉంచడంతో పాటు, ప్రయాణికుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే సంబంధిత ఏటీబీ కేంద్రాలను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు.